Share News

ఎవరమ్మా నువ్వు.. అది ధైర్యమా? నిర్లిప్తతా? పారిస్ మహిళ వీడియో వైరల్

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:01 PM

అల్లకల్లోలంగా మారిన పారిస్ నగరంలో ఓ మహిళ ఉదయం వేళ ధైర్యంగా జాగింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

ఎవరమ్మా నువ్వు.. అది ధైర్యమా? నిర్లిప్తతా? పారిస్ మహిళ వీడియో వైరల్
Paris Woman Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహం హింసాత్మక రూపం దాల్చడంతో జనజీవనం స్తంభించిపోయింది. తమ కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ ప్రజలు రోడ్డెక్కారు. లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలతో నగరం యుద్ధరంగాన్ని తలపిస్తోంది. ఇంతటి భయానక వాతావరణంలో ఓ మహిళ ఎప్పటిలాగే ఉదయం వేళ జాగింగ్‌ కోసం బయటకువచ్చిన వైనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.


చుట్టూ దట్టమైన పొగ, నిరసకారులు-పోలీసుల ఘర్షణలు, హాహాకారాల మధ్యే ఆమె తనకేమీ పట్టనట్టు జాగింగ్ చేసుకుంటూ వెళ్లిపోవడం నెటిజన్లను అమితాశ్చర్యానికి గురి చేస్తోంది. చుట్టూ మంటలు ఎగసిపడుతున్నా, షాపుల్లో లూటీలు జరుగుతున్నా ఆమె లెక్కచేయలేదు. రోడ్డుకు ఓవైపున బారికేడ్ తగలబడుతున్నా ఆమె అటువైపు కనీసం తలతప్పి కూడా చూడలేదు. సినిమాల్లో యుగాంతపు సన్నివేశాన్ని గుర్తు తెచ్చేలా ఉన్న ఆమె వీడియోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది.


ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్స్ చేశారు. ఆమె మనస్తత్వం మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్‌ను గుర్తుచేస్తోందని, ఏ సందర్భంలోనైనా ఆమెకు తనని తాను ప్రధాన పాత్రగా భావించేంతటి నమ్మకం ఉందని కొందరు అన్నారు. రాబోయే రోజుల్లో సమాజం అల్లకల్లోంగా మారినప్పుడు మనమంతా ఇలాంటి మనస్తత్వంతోనే నెట్టుకురావాలని కొందరు చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి తట్టుకోలేకే ఆమె మనసును మళ్లించుకునేందుకు జాగింగ్ చేస్తుండవచ్చని కొందరు అన్నారు. ఇంకొందరు మాత్రం ఆమె తీరును విమర్శించారు. ఆమె ప్రమాదానికి ఎదురెళ్లిందని విమర్శించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు

Updated Date - Oct 19 , 2026 | 01:02 PM