తల్లిపై కూతురి అమానుషం.. జుట్టు పట్టుకుని లాగుతూ..
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:03 AM
హర్యానాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురు అమానుషంగా ప్రవర్తించింది. సరిగా నడవలేని స్థితిలో ఉన్న ఆమెను జుట్టు పట్టుకుని లాగుతూ దాడి చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురు అమానుషంగా ప్రవర్తించింది. సరిగా నడవలేని స్థితిలో ఉన్న ఆమెను జుట్టు పట్టుకుని లాగుతూ దాడి చేసింది. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ వాకర్ సాయంతో నడుస్తున్న తన తల్లిని ఇంట్లోకి తీసుకెళుతోంది. అయితే, ఆ వృద్ధురాలు సరిగా నడవలేకపోతోంది. కాళ్లు ముందుకు కూడా కదపలేకపోతోంది.
దీంతో కూతురు ఆగ్రహానికి గురైంది. తల్లి జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా ప్రవర్తించింది. తల్లిని లోపలికి ఈడ్చుకెళ్లినంత పని చేసింది. 41 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోను సురాజ్ కుమార్ బంద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఇలాంటి కూతురు ఉండటం కంటే.. అసలు పిల్లలే లేకుండా ఉండటం ఉత్తమం’..‘ఈ వీడియో చూసి నా గుండె ముక్కలైంది. ఆ కూతురు ఎంత దారుణంగా ప్రవర్తించింది. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్ట కూడదు’.. ‘తల్లిదండ్రులు ఏది ఇస్తే.. అదే తిరిగి వస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, భారత దేశంలో వృద్ధుల సంక్షేమం కోసం అంటూ ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ 2007 ప్రకారం తల్లిదండ్రులను వదిలేయటం.. వారితో నిర్లక్ష్యంగా ప్రవర్తించటం నేరం. తల్లిదండ్రులపై దాడి చేస్తే భారత న్యాయ సంహిత ప్రకారం శిక్షలు పడతాయి. ఒక్కోసారి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
కొడుకో.. బిడ్డో పుడతారని.. సంతోషంలో ఉండగా..
మొబైల్ షాప్‌లో చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది