woman cooking on heater: వార్నీ.. హీటర్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:02 PM
మనదేశంలో చాలా మంది సామాన్యులు కూడా అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు.
మనదేశంలో చాలా మంది సామాన్యులు కూడా అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ హీటర్‌తో వంట చేస్తోంది (heater cooking video).
angelsingh.2021 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ హీటర్ ఉపయోగించి లిట్టి-చోఖా అనే వంటకాన్ని చేస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల వారికి లిట్టి-చోఖా గురించి బాగా తెలుసు. ప్రస్తుతం చలి కాలం కావడంతో గదిని వేడి చేసుకునేందుకు చాలా మంది ఉత్తరాది వారు హీటర్లను ఉపయోగిస్తుంటారు. అలాంటి రూమ్ హీటర్‌తోనే ఒక మహిళ లిట్టి-చోఖా చేసేస్తోంది. ఆ వీడియో చూసిన వారందరూ ఆమె తెలివిని ప్రశంసిస్తున్నారు (strange cooking hacks).
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (viral cooking video). పది లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. లక్ష మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. రూమ్ వేడిగా మారుతుంది, వంట కూడా పూర్తవుతుంది' అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. భారతీయ గృహిణులు మాత్రమే ఇలా ఆలోచించగలరని మరొకరు ప్రశంసించారు. కాగా, ఇది ప్రమాదకర పద్దతి అని మరొకరు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయేంటి.. ఆసక్తికర కారణాలు తెలిస్తే..
నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్