Share News

ప్రియురాలి పుట్టినరోజు వేడుకల్లో.. భర్తకు దేహశుద్ధి

ABN , Publish Date - May 08 , 2026 | 09:45 PM

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ హోటల్ వేదికగా జరిగిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను మోసం చేస్తూ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, దేహశుద్ధి చేసింది..

ప్రియురాలి పుట్టినరోజు వేడుకల్లో.. భర్తకు దేహశుద్ధి
Mandsaur Hotel Incident

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ హోటల్ వేదికగా జరిగిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను మోసం చేస్తూ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, దేహశుద్ధి చేసింది. సదరు వ్యక్తి గత కొంతకాలంగా తన భార్యకు తెలియకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ప్రియురాలి పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించి.. మందసౌర్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో గదిని బుక్ చేశాడు. అయితే, తన భర్త కదలికలపై మొదటి నుంచీ నిఘా ఉంచిన భార్య.. అతను హోటల్‌కు వెళ్లినట్లు తెలుసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది.


హోటల్ గదిలోకి అకస్మాత్తుగా ప్రవేశించిన భార్యకు.. అక్కడ తన భర్త.. బర్త్‌డే వేడుకల్లో మునిగిపోయి ఉండటం కనిపించింది. తన కళ్లముందే భర్త వేరే మహిళతో ఉండటాన్ని తట్టుకోలేకపోయిన ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. తన బంధువుల సహాయంతో భర్తను, అతడి ప్రియురాలిని చితకబాదింది. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి

పెన్షన్స్‌పై ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం: ఎంపీ శివనాథ్

మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?

Updated Date - May 08 , 2026 | 09:51 PM