Share News

విమానం అద్దంపై సోడా.. పైలట్ ఎందుకిలా చేశాడో తెలుసా..

ABN , Publish Date - Apr 21 , 2026 | 09:20 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పైలట్ చేసిన పనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ కాక్‌పిట్ గ్లాస్‌పై సోడా వేసి బాగా రుద్దుతున్నాడు. అది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు.

విమానం అద్దంపై సోడా.. పైలట్ ఎందుకిలా చేశాడో తెలుసా..
pilot soda cleaning cockpit

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పైలట్ చేసిన పనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ కాక్‌పిట్ గ్లాస్‌పై సోడా వేసి బాగా రుద్దుతున్నాడు. అది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. కాక్‌పిట్ గ్లాస్‌పై సోడా వేసి క్లీన్ చేయడం ఏంటని షాకయ్యారు. అయితే గ్లాస్ క్లీనింగ్ కోసం సోడాను వాడడం అనేది ఎప్పట్నుంచో ఉందట (Pilot soda cleaning cockpit).


విమాన నిపుణులు, పైలట్లు చెప్పేదాని ప్రకారం.. సోడా నీటిలోని కార్బనిక్ ఆమ్లం ఒక అద్భుతమైన క్లీనర్. విమానం ఎగిరేటప్పుడు, నూనె, దుమ్ము, లెక్కలేనన్ని కీటకాలు విండ్‌షీల్డ్‌కు అంటుకుంటాయి. వాటిని సాధారణ నీటితో శుభ్రం చేయడం అంత సులభం కాదు. సోడాలోని కార్బన్ డై ఆక్సైడ్ సులభంగా ఈ మొండి మరకలను తొలగిస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సోడా నీరు అద్దంపై ఉండే సున్నితమైన పొరకు ఎలాంటి హానీ కలిగించదట (Airplane windshield cleaning soda).


ఈ కారణాల వల్ల పైలట్లు విండ్ షీల్డ్‌ను క్లీన్ చేయడానికి ఎక్కువగా సోడా నీటిని ఉపయోగిస్తారట (Viral video pilot soda). విమానాలను శుభ్రపరచడానికి అత్యాధునిక స్ప్రేలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో సోడా నీరు ఎంతో ఉపయోగపడుతుందట.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్


భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 21 , 2026 | 09:20 PM