సూర్యోదయ సమయంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత.. అమెరికాలోని డెత్ వ్యాలీ గురించి తెలుసా..
ABN , Publish Date - Jun 16 , 2026 | 09:55 PM
వేసవి కాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. అయితే భూమిపై కొన్ని ప్రాంతాలు మాత్రం సాధారణ వేడిని మించి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంటాయి.
వేసవి కాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. అయితే భూమిపై కొన్ని ప్రాంతాలు మాత్రం సాధారణ వేడిని మించి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల్లో ఒకటిగా అమెరికాలోని డెత్ వ్యాలీ (Death Valley) గుర్తింపు పొందింది. అక్కడ వేసవి ఉష్ణోగ్రతలు 56 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతుంటాయి (World's Hottest Desert).
కాలిఫోర్నియాలోని మొజావే ఎడారి ప్రాంతంలో డెత్ వ్యాలీ ఉంది. సముద్ర మట్టానికి చాలా దిగువన ఉండటం, చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల అక్కడ వేడి గాలి చిక్కుకుపోయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే దీనిని భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వేసవిలో ఇక్కడి వేడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే, సూర్యోదయం అయిన నిమిషాల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకుంటాయి (Hottest Place on Earth).
డెత్ వ్యాలీ సముద్ర మట్టానికి 86 మీటర్ల (282 అడుగుల) దిగువన ఉంది (Extreme Heat Zone). ఇది ఉత్తర అమెరికాలోనే అత్యంత లోతైన ప్రదేశం. దీని చుట్టూ అన్ని వైపులా ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల, అవి వేడి గాలిని బంధిస్తాయి. పొడి నేల, తక్కువ తేమ గాలిని మరింత వేడిగా చేస్తాయి. ఇది ఎడారి కావడం వల్ల, పగటిపూట తీవ్రమైన సూర్యరశ్మి నేలను కొలిమిగా మారుస్తుంది. రాత్రిపూట కూడా ఆ వేడి బయటకు పోదు. వేసవి కాలంలో అక్కడి నేల ఉష్ణోగ్రత 93 డిగ్రీలకు చేరుకుంటుందట.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..