Share News

జీ7 సదస్సుకు ప్రధాని మోదీ.. ట్రంప్‌తో కరచాలనం..

ABN , Publish Date - Jun 16 , 2026 | 08:08 PM

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు.

జీ7 సదస్సుకు ప్రధాని మోదీ.. ట్రంప్‌తో కరచాలనం..
Modi Trump Meeting

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ప్రత్యక్షంగా కలుసుకున్న వీరిద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది (Trump Modi Handshake).


జీ7 సదస్సు ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ, ట్రంప్ ఒకరితో ఒకరు కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే మొదటిసారి. సదస్సులో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. బుధవారం ఈ ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. భారత్-అమెరికా సంబంధాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భద్రతా అంశాలు, ప్రాంతీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించబోతున్నట్టు సమాచారం (Modi Trump Meeting).


జీ7 సదస్సుకు హాజరైన మోదీ ప్రపంచ నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు (G7 France Summit). అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లతో పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..


సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 16 , 2026 | 08:10 PM