Share News

నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు: నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్..

ABN , Publish Date - Jun 16 , 2026 | 07:11 PM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లేకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనమయ్యేదని అన్నారు.

నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు: నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్..
Trump Netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లేకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనమయ్యేదని అన్నారు. లెబనాన్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు (Trump Israel Remarks).


జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన ట్రంప్.. ఖతార్ ఎమిర్‌తో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. లెబనాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ చర్యలు ప్రాంతీయ శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలిగించకూడదన్నారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే ఆ శాంతి ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు (Trump Netanyahu).


ఇక, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ తెలిపారు (Israel Lebanon News). మరో మార్గం లేకపోవడం వల్లే గత వారం ఇరాన్‌పై దాడులు చేయాల్సి వచ్చిందని అన్నారు. తాజా ఒప్పందం న్యాయమైందని అభిప్రాయపడ్డారు. అయితే ఒప్పందంలో భాగంగా ఇరాన్‌లో అమెరికా పెట్టుబడులు పెట్టనుందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.


ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..


సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 16 , 2026 | 07:15 PM