Share News

షో జడ్జీలకు షాక్ ఇచ్చిన రోబో.. బరువు మోయలేక..

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:22 PM

చైనాలో జరిగిన ‘వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్’ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బార్‌బెల్ వెయిట్స్ మోయటానికి ప్రయత్నించిన ఓ రోబో బ్యాలెన్స్ కోల్పోయింది. షో జడ్జీలపైకి దూసుకెళ్లి, నేలపై బోర్లాపడిపోయింది.

షో జడ్జీలకు షాక్ ఇచ్చిన రోబో.. బరువు మోయలేక..
humanoid robot

ఇంటర్‌నెట్ డెస్క్: చైనాలో జరిగిన ‘వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్’ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బార్‌బెల్ వెయిట్స్ మోయటానికి ప్రయత్నించిన ఓ రోబో బ్యాలెన్స్ కోల్పోయింది. షో జడ్జీలపైకి దూసుకెళ్లి, నేలపై బోర్లాపడిపోయింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీజింగ్ నగరంలో సెకండ్ ఎడిషన్ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో 16 దేశాలకు చెందిన 2 వేల రోబోలు పాల్గొన్నాయి. ఈ రోబోలు 51 కాంపిటీషన్స్‌లో తలపడ్డాయి.


సోమవారం ఫినాలే సందర్భంగా రోబోలకు బరువులు ఎత్తే పోటీ పెట్టారు. ఈ సందర్భంగా రోబోలన్నీ బార్‌బెల్ వెయిట్స్ మోశాయి. ఓ రోబో బరువు ఎత్తుకున్న కొన్ని క్షణాలకే బ్యాలెన్స్ కోల్పోయింది. బార్‌బెల్‌ను కిందపడేసి, షో జడ్జీల వైపు దూసుకెళ్లి బోర్లా పడిపోయింది. కొంచెం ముందుకు వెళ్లి ఉంటే జడ్జీలపై రోబో పడేది. ఇక, ఈ పోటీల్లో బీజింగ్ హ్యూమనాయిడ్ హస్ట్ టీమ్‌కు చెందిన రోబో విజేతగా నిలిచింది. ఆ రోబో ఫినాలేలో ఏకంగా 16 కిలోల బరువును మోసింది.


రోబో బరువు మోయలేక కిందపడిపోయిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘రోబోలు మనుషులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి’.. ‘ఈ పోటీల్లో చైనాకు చెందిన కంపెనీ రోబోనే విజేతగా నిలిచింది. ఇది కొంచెం అనుమానించదగ్గ విషయమే’..‘టెర్మినేటర్, రోబో సినిమాల్లో చూపించినట్లు రోబోలను తయారు చేయాలి. అప్పుడే అన్ని రకాలుగా పని చేయించుకోవటానికి వీలుంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ స్నేహం పేరుతో భారీ మోసం.. కోటిన్నర పోగొట్టుకున్న యువతి

30 ఏళ్ల సంకల్పం నెరవేరింది: సీఎం చంద్రబాబు

Updated Date - Aug 25 , 2026 | 03:43 PM