Share News

ఇదెక్కడి పిచ్చి బ్రదర్.. రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడతారా..

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:45 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.

ఇదెక్కడి పిచ్చి బ్రదర్.. రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడతారా..
shocking stunt

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Shocking Stunt).


@NoContextHumans అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక కుర్రాడు తన శరీరంపై పెట్రోల్ వేసుకున్నాడు. ఆ తర్వాత అతను నదిలోకి దూకడానికి సిద్ధమయ్యాడు. బ్యారికేడ్‌పై నిల్చుని తన శరీరానికి నిప్పు పెట్టుకున్నాడు. శరరీం మండుతున్న సమయంలో నీటిలోకి దూకాడు. అతడు నీటిలోకి దూకిన వెంటనే మంటలు ఆరిపోయాయి. ఇది ప్రాణాంతక సాహసం కావడంతో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు (Man jumps into river with fire).


ఈ ప్రమాదకర సాహసానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Viral news story). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 28 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 21 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇందువల్లే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారని ఒకరు కామెంట్ చేశారు. అతడు నిజంగా ఘోస్ట్ రైడర్‌లా మారిపోయాడని మరొకరు పేర్కొన్నారు. వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడడం అవసరమా అని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ

Updated Date - Feb 21 , 2026 | 02:45 PM