Share News

వామ్మో.. ఈ కుర్రాడికి భయం అంటే తెలియదేమో.. పాముతో ఎలా ఆడుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:53 PM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు.

వామ్మో.. ఈ కుర్రాడికి భయం అంటే తెలియదేమో.. పాముతో ఎలా ఆడుతున్నాడో చూడండి..
child playing with snake

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral snake video).


@Babaxwale అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పాములు ఆడించే ఒక వ్యక్తి రోడ్డుపై కూర్చుని ఉన్నాడు. అతడి ముందు ఓ పాము ఉంది. అక్కడకు ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పాము తోక పట్టుకుని ఆడడం మొదలుపెట్టాడు. పాము అటూ ఇటూ తిరుగుతున్నా, బుసలు కొడుతున్నా ఆ కుర్రాడు భయపడలేదు. చుట్టూ ఉన్న వారు కూడా పాముతో ధైర్యంగా ఆడుతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Child playing with snake).


ఈ వైరల్ వీడియోను కొద్ది సేపట్లోనే వందల మంది వీక్షించారు (Dangerous stunt). చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుర్రాడికి భయం అంటే ఏంటో తెలియదేమోనని ఒకరు కామెంట్ చేశారు. ఆ కుర్రాడు యమధర్మరాజుతో ఆటలాడుతున్నాడని మరొకరు పేర్కొన్నారు. 'ఓ మై గాడ్.. ఆ కుర్రాడిని చూస్తుంటే నాకు భయంగా ఉంది' అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..


లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

Updated Date - Feb 17 , 2026 | 06:53 PM