పాముకు ముద్దులు పెట్టాడు.. ప్రాణం పోయింది..
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:38 PM
మహారాష్ట్రలోని ముంబైలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో చేసిన ఓ డేంజరస్ స్టంట్ పెను విషాదానికి దారి తీసింది. నాగు పాముతో ఆటలు ఆడిన ఓ వ్యక్తి ప్రాణం పోయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: తాగిన మైకంలో చేసిన ఓ డేంజరస్ స్టంట్ పెను విషాదానికి దారి తీసింది. నాగుపాముతో ఆటలు ఆడిన ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబై, విరార్ వెస్ట్‌లోని నవపూర్‌కు చెందిన 40 ఏళ్ల రాజు చందు బరాద్ అనే వ్యక్తి తాగుడుకు బానిస అయ్యాడు. రోజూ తప్పతాగి వీధుల్లో తిరిగే వాడు. శనివారం తప్ప తాగి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డు పక్క ఓ నాగు పాము కనిపించింది. అతడు ఏమాత్రం ఆలోచించకుండా పామును పట్టుకున్నాడు.
ఆ పాముతో స్టంట్ చేయటం మొదలెట్టాడు. జనం చూసి వీడియోలు తీస్తుండటంతో మరింత రెచ్చిపోయాడు. పామును ముద్దులు పెట్టుకోసాగాడు. ఈ నేపథ్యంలోనే ఆ పాము అతడి చేతిని కరిచింది. అయినా అతడు మాత్రం దాన్ని వదల్లేదు. స్టంట్ చేస్తూనే ఉన్నాడు. అరగంట తర్వాత అతడి ఆరోగ్యం విషమించింది. నేలపై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘విష సర్పాలతో ఎప్పుడూ ఆటలు ఆడకూడదు. అతి చేస్తే ఎంత పెద్ద పోటుగాడైనా ప్రాణాలు పోవటం ఖాయం’..‘నాగు పామును ఆట బొమ్మ అనుకున్నట్లు ఉన్నాడు. తెగ ముద్దులు పెడుతున్నాడు. పాపం.. చివరకు ప్రాణం కోల్పోయాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత