భర్తను ఇసుకలో పాతి పెట్టి.. తలకు పూజలు..
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:43 PM
శివరాత్రి సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను ఇసుకలో పాతిపెట్టి, తలకు పూజలు చేసింది. ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో చోటుచేసుకుంది..
ఇంటర్‌నెట్ పుణ్యమా అని ప్రపంచం నలుమూలలా జరిగే వింతలు, విశేషాలు ఇంట్లో కూర్చుని తెలుసుకుంటున్నాం. ఇక సోషల్ మీడియాలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని ఎడ్యుకేట్ చేసేలా ఉంటే.. మరికొన్ని ఎంటర్‌టైన్ చేసేలా ఉంటున్నాయి. శివరాత్రి సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను ఇసుకలో పాతిపెట్టి, తలకు పూజలు చేసింది. ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ తన భర్తను ఇసుకలో పూడ్చిపెట్టింది. తల మాత్రమే బయట ఉంది. ఆ మహిళ మొదట పూలను తలపై చల్లింది. తర్వాత చెంబులోని పాలను తలపై పోసింది. ‘హర హర మహదేవ్’ అంటూ.. భర్త తలకు దండం పెట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఆ మహిళ తన భర్తను ఇసుకలో పాతి పెట్టి ఎందుకు పూజలు చేసిందన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మిషన్ అంబేద్కర్ ఎక్స్ ఖాతాలో ఈ వీడియో ఫిబ్రవరి 16వ తేదీన పోస్ట్ అయింది.
ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దేశంలో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆచారం, సంప్రదాయం ఉంటుంది. ఎవరి భక్తి వారిది. ఈ వీడియో చూసి మనం నవ్వాల్సిన అవసరం లేదు’.. ‘హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఇదే. పతి పరమేశ్వర్ అంటారు.. అంటే భర్త ఈశ్వరుడితో సమానం అని. ఇది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
టీ20 ప్రపంచ కప్2026: కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం