Share News

Extorting Truck Drivers: అక్కడ లారీ డ్రైవర్లకు గడ్డుకాలం.. మేకులతో భయపెడుతున్న మహిళలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 07:46 AM

పశ్చిమ బెంగాల్‌లో మహిళల కారణంగా లారీ డ్రైవర్‌లు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆ మహిళలు మేకులతో లారీ డ్రైవర్లను భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Extorting Truck Drivers: అక్కడ లారీ డ్రైవర్లకు గడ్డుకాలం.. మేకులతో భయపెడుతున్న మహిళలు
Extorting Truck Drivers

పశ్చిమ బెంగాల్‌లో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. కొంతమంది మహిళల కారణంగా లారీ డ్రైవర్లు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆ మహిళలు మేకులతో లారీ డ్రైవర్లను భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


మట్టి రోడ్డుపై లారీలు వెళ్తున్నాయి. రోడ్డు పక్కన ఇద్దరు మహిళలు చేతుల్లో పొడవాటి కర్రలతో నిల్చుని ఉన్నారు. ఆ కర్రల చివర మేకులు కొట్టి ఉన్నాయి. ఆ మహిళలు మేకులు కొట్టిన కర్రలు టైర్ల కింద పెడతామంటూ సైగలు చేశారు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ లారీ ఆపేశాడు. కొంత డబ్బు తీసి ఓ మహిళకు ఇచ్చాడు. వారు మేకులు కొట్టిన కర్రను పక్కకు తీశారు. దీంతో లారీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక, ఈ వీడియోపై స్పందించిన ఓ నెటిజన్...‘మీకు వారు ఎందుకు అలా చేస్తున్నారో తెలుసా?.. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఆ మహిళలు ఉంటున్న గ్రామం దగ్గరలో బొగ్గు మైనింగ్ జరుగుతోంది.


లారీలు అటువైపు ఎక్కువగా తిరగటం వల్ల దుమ్ము, ధూళి విపరీతంగా వచ్చి గ్రామస్తులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అందుకే వాళ్లు అలా డబ్బులు తీసుకుంటున్నారు. అందులో ఎలాంటి దుర్మార్గం లేదు’ అంటూ కామెంట్ చేశాడు. అయితే, కొంతమంది మాత్రం ఆ మహిళలు చేస్తున్న పనిని తప్పుబడుతున్నారు. ఓ నెటిజన్ ..‘ ‘ఇది మరీ దారుణంగా ఉంది. మేకులు కొట్టిన కర్రలతో డ్రైవర్లను బెదిరించటం ఏంటి? అక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఆ సంఘటన సరిగ్గా ఎప్పుడు? ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.


ఇవి కూడా చదవండి

బలపడుతున్న బంధం.. బంగ్లాదేశ్ నుంచి పాకిస్థాన్‌కు నేరుగా విమాన సర్వీసులు..

పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

Updated Date - Jan 08 , 2026 | 07:55 AM