Share News

Bangladesh Pakistan relations: బలపడుతున్న బంధం.. బంగ్లాదేశ్ నుంచి పాకిస్థాన్‌కు నేరుగా విమాన సర్వీసులు..

ABN , Publish Date - Jan 08 , 2026 | 07:12 AM

భారత్‌తో శత్రుత్వం పాటిస్తున్న పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు చేరువ అవుతోంది. షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లా అనేక రంగాల్లో పాక్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.

Bangladesh Pakistan relations: బలపడుతున్న బంధం.. బంగ్లాదేశ్ నుంచి పాకిస్థాన్‌కు నేరుగా విమాన సర్వీసులు..
Bangladesh Pakistan direct flights

భారత్‌తో శత్రుత్వం పాటిస్తున్న పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు చేరువ అవుతోంది. షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లా అనేక రంగాల్లో పాక్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. బంగ్లా జాతీయ విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ఈ నెల చివర్లో కరాచీకి నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించనుంది (Bangladesh Pakistan direct flights).


జనవరి 29వ తేదీన ఢాకా నుంచి కరాచీకి నాన్-స్టాప్ విమాన సర్వీస్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. షేక్ హసీనా పాలనలో ఉన్న సమయంలో బంగ్లా-పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కాగా, బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ కరాచీ చేరుకోవడానికి భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగిస్తుందో, లేదో చూడాలి. ఎందుకంటే ఢాకా నుంచి కరాచీకి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేరుకోవాలంటే భారత గగనతలాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓవర్‌ఫ్లైట్ అనుమతుల కోసం న్యూఢిల్లీ నుంచి అవసరమైన క్లియరెన్స్‌ను పొందాల్సి ఉంటుంది (India Bangladesh tensions).


కాగా, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ తన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను బంగ్లాదేశ్‌కు విక్రయించనుంది (Bangladesh Pakistan fighter jet deal). జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను చైనా, పాకిస్థాన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తిగా ఉందని పాక్ సైన్యం ప్రకటించింది. ఇటీవల ఇస్లామాబాదాల్‌లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఛీప్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్, బంగ్లా ఎయిర్ ఫోర్స్ ఛీప్ మార్షల్ హసన్ మొహ్మద్ ఖాన్ సమావేశమై యుద్ధ విమానాల విషయంలో చర్చలు జరిపారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..


కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..

Updated Date - Jan 08 , 2026 | 07:12 AM