ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసుండరు.. పాంగి లోయలో మంచు ప్రవాహం..
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:05 PM
భారీ మంచు కారణంగా పాంగి లోయ కొత్త శోభను సంతరించుకుంది. లోయలో మంచు ప్రవాహం మొదలైంది. మంచు నది ఏమైనా ప్రవహిస్తోందా? అనేంతలా అక్కడి పరిస్థితి మారిపోయింది..
ఇంటర్‌నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని మిందల్ గ్రామంలో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. భారీ మంచు కారణంగా పాంగి లోయ కొత్త శోభను సంతరించుకుంది. లోయలో మంచు ప్రవాహం మొదలైంది. మంచు నది ఏమైనా ప్రవహిస్తోందా? అనేంతలా అక్కడి పరిస్థితి మారిపోయింది. నిఖిల్ సైనీ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘ హిమాలయాల్లో భారీగా మంచు కురుస్తోంది. నిన్న మంచు కురిసిన తర్వాత .. ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడిపోయింది.
మీరు ఇప్పటి వరకు నీటి ప్రవాహాన్ని చూసుంటారు. ఈ రోజు మంచు ప్రవాహాన్ని చూడండి’ అని రాసుకొచ్చాడు. ఆ వీడియోలో ఏముందంటే.. పాంగి లోయ మొత్తం మంచుతో కప్పబడింది. లోయ మధ్యలో పైనుంచి కిందకు మంచు ప్రవహిస్తోంది. ఓ వ్యక్తి పక్కన ఉన్న కొండపై నిలుచుని ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. లోయ మధ్యలో మంచు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. 20 సెకన్ల ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మంచు ప్రవాహంపై కామెంట్లు చేస్తున్నారు.
కాగా, కొండ ప్రాంతాల్లో మంచు జలపాతంలా ప్రవహించటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. లోయలో పెద్దఎత్తున పేరుకుపోయిన మంచు భారీ గాలుల కారణంగా ఇలా కిందకు జారుతోంది. పాంగి లోయలో 27వ తేదీన భారీ ఎత్తున మంచు కురిసింది. గ్రావిటీ కారణంగా కొండచరియలపై పేరుకుపోయిన మంచు ఇలా ఒక్కసారిగా కిందకు జారుతోంది. నది ప్రవహిస్తున్నట్లుగా భ్రమ కల్పిస్తోంది. అయితే, ఈ మంచు ప్రవాహాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని నిపుణులు అంటున్నారు. అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..
బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్..