ట్రక్కును తాకుతూ వెళ్లిన బోయింగ్ విమానం.. వైరల్‌గా మారిన ప్రమాద వీడియోలు..
ABN , Publish Date - May 07 , 2026 | 11:29 AM
అమెరికాలోని న్యూజెర్సీలో రోడ్డుపై వెళుతున్న బేకరీ ట్రక్కును బోయింగ్ 767 విమానం తాకుతూ వెళ్లింది. విమానం టైర్లు ట్రక్కును బలంగా తాకటంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ట్రక్కు నడుపుతున్న డ్రైవర్ గాయాలపాలయ్యాడు.
న్యూయార్క్, మే 7: రోడ్డుపై వెళుతున్న బేకరీ ట్రక్కును బోయింగ్ 767 విమానం తాకుతూ వెళ్లింది. విమానం టైర్లు ట్రక్కును బలంగా తాకటంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ట్రక్కు నడుపుతున్న డ్రైవర్ గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వారెన్ బార్డ్‌లీ జూనియర్ అనే వ్యక్తి వారంలో ఐదు రోజులు న్యూజెర్సీ టర్న్‌పైక్‌లోని హైవేపై బేకరీ ట్రక్కును నడుపుతుంటాడు.
రెండు రోజుల క్రితం కూడా వారెన్ హైవేపై ట్రక్కు నడుపుతున్నాడు. అదే సమయంలో యూఎస్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం ల్యాండ్ అవసాగింది. ఈ నేపథ్యంలోనే రోడ్డు మీద వెళుతున్న ట్రక్కును విమానం టైర్లు తాకాయి. దీంతో ట్రక్కు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ట్రక్కులో ఉన్న వారెన్ గాయాలతో బయపడ్డాడు. కొంచెం అటు, ఇటు అయినా విమానం కుప్పకూలిపోయి ఉండేది. భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ఈ సంఘటనపై వారెన్ తండ్రి వారెన్ బార్డ్‌లీ సీనియర్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు ఏం జరిగిందో నమ్మలేకపోయాడు. వెంటనే నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. విమానం తన ట్రక్కును ఢీకొట్టిందని చెప్పాడు. నేను కూడా నమ్మలేకపోయాను’ అని అన్నాడు.
వారెన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘ది నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్’ ఈ సంఘటనపై అధికారిక దర్యాప్తు చేపట్టింది. ట్రక్కును తాకుతూ వెళ్లిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, విమానంలోని ఎవ్వరికీ ఏమీ కాలేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
తమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరగాలి: జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు