భారత్-పాక్ సరిహద్దు.. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? వైరల్ వీడియో
ABN , Publish Date - May 25 , 2026 | 07:07 PM
భారత్-పాక్ సరిహద్దును చూసి జనాలు అబ్బురపడేలా చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాక్ సరిహద్దు ప్రస్తావన రాగానే ఎవరికైనా ముందుగా ఉద్రిక్త వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, రాత్రి వేళ ఈ సరిహద్దును ఆకాశం నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ పైలట్ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ఈ వీడియోను షేర్ చేశారు. సరిహద్దు వెంబడి వరుసగా దీపాలను పేర్చినట్టు ఉన్న సీన్ చూసి జనాలు అబ్బురపడుతున్నారు.
ఈ సరిహద్దుకు సమీపం నుంచి విమానం వెళుతుండగా పైలట్ ప్రయాణికులను తమ పక్కన ఉన్న కిటికీల్లోంచి సరిహద్దును చూడమని చెప్పారు. ‘మీరు బయటకు చూస్తే సరిహద్దు కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక గస్తీ ఉన్న సరిహద్దు’ అని అన్నారు. రాడ్‌క్లిఫ్ లైన్‌గా కూడా పేరుపొందిన ఈ సరిహద్దు వెంబడి పసుపు పచ్చ లైట్లు ఏర్పాటు చేయడంతో పైనుంచి చూసినప్పుడు అద్భుతమైన దీపాల వరుసలాగా కనిపించింది.
ఇక వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘భారత్-పాక్ సరిహద్దును అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా చూడవచ్చని కొందరు అంటుంటారు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. సరిహద్దుకు రెండు వైపులా ఉన్న ప్రజల మధ్య వైరం రాజకీయమైనదే కానీ వ్యక్తిగతం కాదని కొందరు అన్నారు. విమానం నుంచి చూసినా కనిపించేలా సరిహద్దు వెంబడి లైట్స్‌ను ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతమేనని మరికొందరు అన్నారు. ఎప్పటికీ కలవని రెండు సముద్రాలు పక్కపక్కనే ఉన్నట్టు కనిపిస్తోందని మరొక వ్యక్తి వ్యాఖ్యానించారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలనూ చదవండి:
మా దేశంలో ఏం చేస్తామో తెలిస్తే భారతీయులు షాకవుతారు: యూఎస్ మహిళ
ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు