మా దేశంలో ఏం చేస్తామో తెలిస్తే భారతీయులు షాకవుతారు: యూఎస్ మహిళ
ABN , Publish Date - May 24 , 2026 | 05:37 PM
తమ దేశంలో విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందో తెలిస్తే భారతీయులు షాకయ్యే ఛాన్స్ ఉందంటూ ఒక అమెరికన్ మహిళ పెట్టిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తమ దేశంలో విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందో తెలిస్తే భారతీయులు షాకవ్వొచ్చంటూ ఒక అమెరికన్ మహిళ పెట్టిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
భారత్‌లో ఉంటున్న ఆ అమెరికా మహిళ ఇక్కడ తాను చూసిన విషయాలపై తన అభిప్రాయాలను కూడా షేర్ చేశారు. భారతీయులు ఏసీలను అవసరమైనప్పుడు మాత్రమే వినియోగిస్తారని చెప్పారు. కానీ తమ దేశంలోని ఇళ్లల్లో ఎండాకాలం ఏసీ నిరంతరం ఆన్‌లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. భారతీయుల ఇళ్లల్లో ఒక్కో గదికీ స్ప్లిట్ ఏసీ ఉంటే తాము ఇల్లంతా చల్లబరిచేందుకు వీలుగా సెంట్రలైజ్డ్ ఏసీ వ్యవస్థను వాడతామని చెప్పారు. భారతీయులు బయటకు వెళ్లినప్పుడు ఏసీని ఆఫ్ చేస్తారని అన్నారు.
చలికాలంలో ఇంట్లో వెచ్చగా ఉండేందుకు అమెరికాలోని ఇళ్లల్లో హీటింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఇంట్లో ఎవరూ లేకపోయినా వీటిని ఆన్‌లోనే ఉంచకపోతే పైపుల్లోని నీళ్లు గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పారు. లోపలి వేడిని నియంత్రించేందుకు అమెరికన్ ఇళ్లల్లో తప్పనిసరిగా థర్మోస్టాట్ ఉంటుందని కూడా వివరించారు. ఇది ఇంట్లోని ఉష్ణోగ్రత నిరంతరం ఒకే స్థాయిలో ఉండేలా నియంత్రిస్తుందని చెప్పారు.
ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విద్యుత్ రేట్లు తగ్గిస్తే భారత్‌లో కూడా జనాలు ఏసీలను నిరంతరం ఆన్‌లో ఉంచుతారని కొందరు సెటైర్లు పేల్చారు. ఇలా నిరంతరం వీటిని ఆన్‌లో పెట్టడమంటే విద్యుత్ వృథానే అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ తీరు వాతావరణ మార్పులకు కారణమవుతోందని విచారం వ్యక్తం చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీ వ్యవస్థ భారత్‌లో కూడా ఉంటుందని, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఎక్కువగా వినియోగిస్తారని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..
ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు