ఏంటి.. లండన్ మెట్రో ఇలా ఉంటుందా? మహిళ వీడియో వైరల్
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:16 PM
లండన్ అండర్‌గ్రౌండ్ మెట్రోలో అపరిశుభ్ర పరిస్థితులను చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు ఢిల్లీ మెట్రో మరింత పరిశుభ్రంగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాశ్చాత్య దేశాలను చాలా మంది భూతల స్వర్గాలుగా భావిస్తారు. అక్కడి పరిశుభ్రత, జనాల్లో పౌర స్పృహ అద్భుతమని కీర్తిస్తుంటారు. అయితే, ఇందుకు భిన్నమైన వీడియోను షేర్ చేసిన ఒక మహిళ ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
మెహర్మా అనే మహిళ ఈ వీడియోను పోస్టు చేశారు. పాశ్చాత్య దేశాల తీరుతెన్నులను పాకిస్థానీలు, భారతీయులు తమ స్వదేశంలో గొప్పగా చెప్పుకుంటారని సెటైర్ పేలుస్తూ వీడియోను పంచుకున్నారు. లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లు, రైళ్లల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని ఆమె రికార్డు చేశారు. కొన్ని దృశ్యాలు చూడటానికి ఇబ్బందిగా ఉంటాయని కూడా ఆమె నెటిజన్లను ముందస్తుగా హెచ్చరించారు. దుర్వాసన కూడా ఎక్కువగానే ఉందని అన్నారు.
‘ఈ వీడియోలు చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తాయని తెలుసు. అయినా, లండన్‌లో మా బంధువుల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ వీడియోను షేర్ చేయకతప్పలేదు. ఇలాంటిదేమీ ఉండదని లండన్ వాసులు అంటారని కూడా నాకు తెలుసు’ అని ఆమె వీడియోలో కామెంట్ చేశారు. ఈ దృశ్యాలు చూస్తే ఇది లండన్ యేనా అనే సందేహం కూడా కలుగుతుందని అన్నారు. కానీ కొన్ని స్టేషన్‌లలో ఇలాంటి సీన్స్ సర్వసాధారణమని కూడా చెప్పారు.
ఇక ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వీడియోలోని దృశ్యాలకంటే ఢిల్లీ మెట్రో వెయ్యి రెట్లు బెటరని కొందరు కామెంట్ చేశారు. భారత్‌లో దాదాపు అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్లు శుభ్రంగా ఉంటాయని అన్నారు. లండన్‌లో ఉండే వ్యక్తిగా చెబుతున్నా.. ఇదంతా నిజమే అని మరో వ్యక్తి అన్నారు. మరికొందరు మాత్రం మహిళ వీడియోతో విభేదించారు. లండన్ చాలా అందంగా ఉంటుందని, వీడియోలో చూపించినట్టుగా ఉండని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలూ చదవండి:
ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో చెప్పే ట్రిక్! జనాల నుంచి మిశ్రమ స్పందన
టిక్కెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..