Share News

పిల్లల ముందే అసభ్య ప్రవర్తన.. అమ్మాయిల పోస్టర్లను..

ABN , Publish Date - May 23 , 2026 | 03:44 PM

ఓ వృద్ధుడు చిన్న పిల్లల ముందే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించాడు. డీజే ట్రక్‌పై ఉన్న అమ్మాయిల ఫొటోలను నాకుతూ అత్యంత నీచానికి దిగజారాడు.

పిల్లల ముందే అసభ్య ప్రవర్తన.. అమ్మాయిల పోస్టర్లను..
Viral Video

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ వృద్ధుడు చిన్న పిల్లల ముందే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించాడు. డీజే ట్రక్‌పై ఉన్న అమ్మాయిల ఫొటోలను నాకుతూ అత్యంత నీచానికి దిగజారాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముజఫరాపూర్ జిల్లా, గాయ్‌ఘాట్‌కు చెందిన విశానంద్ డీజే ట్రక్ ఓ కార్యక్రమం కోసం ఓ గ్రామానికి వెళ్లింది. ట్రక్ రోడ్డుపై ఆగి ఉండగా పెద్ద సంఖ్యలో జనం దాన్ని చుట్టుముట్టారు. మరీ ముఖ్యంగా పిల్లలు దాని చుట్టూ మూగి ఎంతో ఆసక్తిగా చూడసాగారు.


ఇంతలో ఓ వృద్ధుడు ట్రక్ దగ్గరకు వచ్చాడు. ట్రక్‌పై ఉన్న అమ్మాయిల పోస్టర్‌ను చూసి రెచ్చిపోయాడు. అమ్మాయిల పోస్టర్‌ను నాకుతూ, ముద్దులు పెడుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్న పిల్లలు చూస్తున్నా సరే ఆ వృద్ధుడు పాడు పని ఆపలేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు వృద్ధుడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


‘ఇండియా(బిహార్‌)లో పోస్టర్ల మీద కూడా అమ్మాయిలకు రక్షణ లేదు. అతడు అమ్మాయిల పోస్టర్లను నాకుతున్నాడు. పక్కనే బాలికలు ఉండటం మీరు గమనించవచ్చు. ఇలాంటి వాళ్లు చిన్న పిల్లలపై అత్యాచారం చేసే అవకాశం ఎక్కువ’ అంటూ జశ్విందర్ కౌర్ అనే యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దారుణంగా ఉంది. పక్కన ఉన్న పిల్లలు దీన్ని చూసి నేర్చుకుంటున్నారు’ అంటూ నీరజ్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి

మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

ఆస్తి కోసం తల్లి, చెల్లిని తరిమేశాడు.. జగన్ వ్యక్తిత్వం అది: మంత్రి అనగాని సత్యప్రసాద్

Updated Date - May 23 , 2026 | 03:49 PM