వందల అడుగుల ఎత్తులో.. విద్యుత్ తీగపై భోజనం! వీడియో వైరల్
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:15 AM
ఒక్కసారి కిందికి చూస్తేనే గుండె జారిపోయేంత ఎత్తు.. చుట్టూ హై-వోల్టేజ్ విద్యుత్ తీగలు.. అయినా అతనిలో మాత్రం ఏమాత్రం భయం లేదు. పైగా అక్కడే కూర్చుని ప్రశాంతంగా భోజనం చేస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తోంది. వీడియోలో వందల అడుగుల ఎత్తులో ఉన్న పవర్ గ్రిడ్ విద్యుత్ తీగపై కూర్చుని కనిపించాడు. సాధారణంగా అంత ఎత్తుకు వెళ్లడానికే చాలామంది భయపడుతుంటారు. కానీ.. ఈ వ్యక్తి ఏమాత్రం బెరుకు లేకుండా తీగపై కూర్చుని, ఆహారం తింటూ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను కూర్చున్న ప్రదేశం నుంచి కిందకు చూస్తే నేల చాలా దూరంగా కనిపిస్తోంది. చుట్టూ భారీ విద్యుత్ తీగలు, ఎత్తైన విద్యుత్ స్తంభాల మధ్య అతను కూర్చున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు ‘ఏం గుండెరా అది’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ముఖంలో ఎలాంటి భయాందోళనలు కనిపించకపోవడం. సాధారణంగా వందల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తేనే చాలా మందికి భయం కలుగుతుంది. కానీ అతను మాత్రం ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా భోజనం చేస్తూ కనిపించాడు. ఇతను తన రోజూ వారీ పనిలో భాగంగా ఇలా చేసినా కూడా.. చూపరులను మాత్ర ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కార్మికుల కమిట్‌మెంట్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ‘పొట్టుకూటి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలాంటి పరిస్థితిలో పని చేయడం గ్రేట్’.. అంటూ కొందరు, ‘మీ ధైర్యానికి హ్యాట్సాప్’. . అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్: ఆశ చావలేదు.. కృనాల్ పాండ్య పోస్ట్ వైరల్!