ప్రార్థన జరుగుతుండగా చిన్నారి ఏం చేశాడో తెలుసా? వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:46 PM
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. భక్తి అంటే కేవలం నిశ్శబ్దంగా ధ్యానించడమే కాదు, మనసుకు నచ్చిన పనిని దైవచింతనతో చేయడమని ఒక చిన్నారి నిరూపించాడు. పాఠశాల ప్రార్థన సమయంలో జరిగిన ఒక ఘటన, చూసేవారికి నవ్వు తెప్పించినా, ఆలోచింపజేసేలా ఉంది. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పాఠశాల పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో ఒక బాలుడి జేబులో నుంచి మిఠాయి తీసి మెల్లిగా తిన్నాడు. ఆ సమయంలో చిన్నారి ప్రార్థన కొనసాగిస్తూ కళ్లు తెరవలేదు. మరో పిల్లవాడు అతన్ని చూస్తూ ఉండిపోయాడు. మిఠాయి తిన్న తర్వాత, చిన్నారి ఆ మిఠాయి పుల్లను తిరిగి తన జేబులో పెట్టుకుని మళ్లీ చేతులు జోడిస్తూ ప్రార్థన చేస్తుంటాడు. కానీ, అప్పటికే ప్రార్థన ముగిసిపోతుంది. ఆ సమయంలో బాలుడి అమాయకత్వం, ప్రార్థనపై భక్తి, పర్యావరణంపై శ్రద్ధ చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది.
ఈ వీడియో @ChapraZila అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘అతను కళ్ళు ముసుకొని తింటున్నాడు’ అని కామెంట్ చేయగా, ‘ఇంత చిన్న పిల్లవాడిపై ఏం చర్యలు తీసుకుంటారు?’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ప్రార్థన తర్వాత చేద్దాం.. ముందు మిఠాయి ఆరగిద్దాం’ అంటూ ఫన్నీగా ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..