Share News

రోడ్డుపై దూసుకుపోతున్న సిక్స్ సీటర్ బైక్.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:44 AM

దేశంలో యువతకు కొదవలేదు. వారిలో సృజనాత్మకతకు అంతే లేదు. వాటిని వారు సక్రమంగా వినియోగించుకుంటే.. నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఓ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

రోడ్డుపై దూసుకుపోతున్న సిక్స్ సీటర్ బైక్.. వీడియో వైరల్..

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో యువతకు కొదవలేదు. వారిలో సృజనాత్మకతకు అంతే లేదు. వాటిని వారు సక్రమంగా వినియోగించుకుంటే.. నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఓ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఇళ్లు, ఆఫీసుల్లో లేదా వివిధ కార్యక్రమాల్లో కూర్చోవడానికి ప్లాస్టిక్ కుర్చీలు ఉపయోగిస్తారు. ఆ కుర్చీలను ఉపయోగించి.. కొంతమంది యువకులు 6 సీటర్ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశారు.


పొడవైన నీలం, తెలుపు ఫ్రేమ్‌పై ఆరు రెడ్ కలర్ ప్లాస్టిక్ కుర్చీలు వరుసగా ఫిట్ చేశారు. వాహనం ముందు భాగంలో బైక్ హ్యాండిల్ బార్లకు లైట్లు, హార్న్ అమర్చారు. మోటర్, బ్యాటరీలు వాహనం కింద ఉంచారు. అయితే ఈ బైక్ విశేషం ఏమిటంటే.. ఈ బైక్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. ఈ వీడియోలో ఆ కుర్చీలపై స్నేహితులంతా వరుసగా కూర్చుని రహదారిపై వేగంగా దూసుకుపోతూ.. ఎంజాయి చేస్తున్నారు. ఈ ఆసక్తికర వీడియోను విలేజ్వాతి అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. తొమ్మిది లక్షల మందికిపైగా నెటిజన్లు లైక్ కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది మేడిన్ ఇండియా ఆవిష్కరణ అని ప్రశంసిస్తున్నారు. ఓ బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించవచ్చని.. కానీ ఒకేసారి ఇలా ఆరుగురు ప్రయాణించడం వెరైటీగా ఉందని చెబుతున్నారు. ఈ బైక్ ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉందని అంటున్నారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణమని వారు అభివర్ణిస్తున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 08:44 AM