Share News

రైలులో ప్యాంటు విప్పిన యువకుడు.. బుద్ధి చెప్పిన ప్రయాణికులు..

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:30 PM

రైలు ప్రయాణంలో ఓ యువకుడు తన ఒంటిపై ఉన్న ప్యాంటుని తీసేయడం తీవ్ర కలకలం రేపింది. మహిళలు, యువతులు, చిన్నారులు ఉన్నా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్యాంటుని కిందకి దించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

రైలులో ప్యాంటు విప్పిన యువకుడు.. బుద్ధి చెప్పిన ప్రయాణికులు..

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణంలో ఓ యువకుడు తన ఒంటిపై ఉన్న ప్యాంటుని తీసేయడం తీవ్ర కలకలం రేపింది. మహిళలు, యువతులు, చిన్నారులు ఉన్నా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్యాంటుని కిందకి దించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. రైలులోని కొంతమంది యువకులు కలుగచేసుకుని అతనికి బుద్ధి చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటన తోటి ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


@KimKatieUSA అనే ఎక్స్ ​​యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. కదులుతున్న రైలులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే, ఓ యువకుడు మాత్రం అసాధారణంగా ప్రవర్తించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఒక్కసారిగా తాను వేసుకున్న ప్యాంటు, అండర్‌వేర్‌ని తీసేశాడు. బెల్ట్‌ని మెడలో వేసుకుని గట్టిగా అరవడం ప్రారంభించాడు. దుండగుడి ప్రవర్తనకు తొలుత ఆశ్చర్యపోయిన ప్రయాణికులు, ఆ తర్వాత ప్రశ్నించడం మెుదలుపెట్టారు. ఓ యువకుడు అతని వద్దకు వెళ్లి గట్టిగా నిలదీయగా వాగ్వాదానికి దిగాడు. పక్కన ఉన్న మరికొంతమంది యువకులు కలుగచేసుకుని అతని చర్యలను ఖండించారు. దుండగుడు దుర్భాషలాడడంతో ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు.


యువకుడిని కాళ్లు, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. బోర్లా పడుకోబెట్టి చేతులు రెండూ వెనక్కి లాగి పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న మహిళలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వేరే కోచ్‌ల్లోకి పరుగులు పెట్టారు. మరుసటి స్టేషన్ రాగానే యువకులంతా కలిసి దుండగుడి కాళ్లు, చేతులు పట్టుకుని రైలు నుంచి బయటకు పడేశారు. ఈ ఘటన ఏ దేశంలో జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. అలాగే సదరు యువకుడు అలా ఎందుకు ప్రవర్తించాడనే విషయంపైనా క్లారిటీ రాలేదు. కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

అంగన్‌వాడీ నిర్లక్ష్యం.. గర్భిణికి ఇచ్చిన పోషకాహారంలో చనిపోయిన పాముపిల్ల.!

కిలో బెండకాయల ధర రూ.7,200.. ఇంత రేటు ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Jun 07 , 2026 | 06:39 PM