Share News

గోడపై నుంచి నీటిలోకి కోతుల జంప్‌.. చూస్తే నవ్వు ఆపుకోలేరు! వీడియో వైరల్

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:50 PM

గోడపై కూర్చున్న కోతులు ఒక్కసారిగా నీటిలోకి జంప్ చేశాయి.. ఒకటి దూకగానే మరొకటి, ఆ తర్వాత ఇంకొకటి.. ఇలా వరుసగా మనుషుల తరహాలో నీటిలోకి దూకుతూ కోతులు చేసిన మస్తీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గోడపై నుంచి నీటిలోకి కోతుల జంప్‌.. చూస్తే నవ్వు ఆపుకోలేరు! వీడియో వైరల్
Funny Monkey Video

ఇంటర్నెట్ డెస్క్: జంతువుల ప్రపంచంలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని దృశ్యాలు తెలియకుండానే చిరునవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కోతుల గుంపు చేసిన అల్లరి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలో కొన్ని కోతులు ఎత్తైన గోడపై కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా ఓ కోతి గోడపై నుంచి కింద ఉన్న నీటిలోకి దూకుతుంది. దాన్ని చూసిన మిగతా కోతులు కూడా ఒక్కొక్కటిగా నీటిలోకి దూకడం మొదలుపెట్టాయి. నీటిలోకి వెళ్లిన తర్వాత ఈదుకుంటూ తిరిగి గోడ వద్దకు చేరుకుని మళ్లీ పైకి ఎక్కుతున్నాయి.


ఇంతటితో వాటి ఆట ఆగలేదు. పైకి ఎక్కిన వెంటనే మరోసారి నీటిలోకి దూకుతూ కోతులు తెగ సందడి చేశాయి. ఒకటి నీటిలోకి దూకితే.. మరొకటి దాని స్థానంలో జంప్ చేస్తోంది. మళ్లీ ఈదుకుంటూ గోడ దగ్గరకు వచ్చి పైకి ఎక్కి మరోసారి అదే విన్యాసం చేస్తున్నాయి. పైభాగంలో ఉన్న కోతులు కూడా తమ సహచరుల విన్యాసాలను ఆసక్తిగా చూస్తూ.. తమ వంతు కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎలాంటి భయం లేకుండా పదేపదే నీటిలోకి దూకుతూ, ఈదుతూ, మళ్లీ గోడపైకి ఎక్కుతున్న కోతుల అల్లరి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను తెగ నవ్విస్తోంది.


Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 01:55 PM