సిగరెట్ బాబాగా బాలుడు.. గుప్పుగుప్పుమంటూ సిగరెట్లు తాగుతూ..
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:46 PM
సిగరెట్లు తాగుతున్న ఓ బాలుడిని జనం బాబాగా భావిస్తున్నారు. అతడి ఆశీర్వాదాలు తీసుకోవటానికి ఎగబడుతున్నారు. బాలుడిపై డబ్బుల వర్షం కురిపిస్తున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వింత సంఘటన వెలుగు చూసింది. సిగరెట్లు తాగుతున్న ఓ బాలుడిని జనం బాబాగా భావిస్తున్నారు. అతడి ఆశీర్వాదాలు తీసుకోవటానికి ఎగబడుతున్నారు. బాలుడిపై డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. టీషర్ట్ వేసుకున్న బాలుడు రెండు సిగరెట్లను చేత్తో పట్టుకుని గుప్పుగుప్పుమంటూ పొగ పీల్చి వదులుతున్నాడు . బాలుడి చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. వారు ఎంతో భక్తితో అతడి వైపు చూస్తూ ఉన్నారు.
కొంతమంది బాలుడిపై పెద్ద సంఖ్యలో కరెన్సీ నోట్లు విసురుతున్నారు. మరికొంతమంది అతడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తాను ఓ దేవుడిని అన్నట్లు ఆ బాలుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆ బాలుడు ఎవరన్న సంగతి తెలియరాలేదు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు బాలుడిపై.. అక్కడి జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి తప్పు పనులు ఏంటి? బాలుడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?’..‘అతడు సిగరెట్ బాబాగా అవతారం ఎత్తాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. భయాందోళనలో ప్రజలు
డాక్టర్ కృతికా రెడ్డి మర్డర్ కేసు.. వెలుగులోకి భర్త మెసేజ్‌లు..