విజయ్‌ని భయపెట్టిన ఫ్యాన్.. సైకిల్ ఆపి పరుగో పరుగు..
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:08 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలను ఆకర్షించటం కోసం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్లపై సైకిల్ తొక్కుతున్నారు.
చెన్నై, ఏప్రిల్ 13: అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలను ఆకర్షించటం కోసం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్లపై సైకిల్ తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ సైకిల్ ప్రచారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. విజయ్ తన ప్రచార వాహనం ముందు సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆయన వెంట పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వింత సంఘటన చోటుచేసుకుంది.
ఓ అభిమాని సైకిల్ ముందు పూలు చల్లాడు. విజయ్ ఏమనుకున్నారో ఏమో తెలీదు కానీ, వెంటనే సైకిల్ ఆపేశారు. ఆ వెంటనే వెనకాల ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీస్తూ విజయ్ దగ్గరకు వచ్చారు. సైకిల్‌ను, ఆయనను తీసుకుని వెనక్కు వెళ్లిపోయారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది అది ఏఐతో తయారు చేసిన వీడియో అంటున్నారు. ‘బాంబు దాడి జరుగుతుందేమోనని విజయ్ భయపడిపోయారు. అందుకే సైకిల్ ఆపి వెనక్కు వెళ్లిపోయారు’..‘మరీ ఇంత భయం ఉంటే రాజకీయాల్లో కష్టమే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రెండు చోట్ల నుంచి విజయ్ పోటీ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించాలన్న లక్ష్యంతో విజయ్ ముందుకు సాగుతున్నారు. పక్కా ప్లాన్‌తోనే రంగంలోకి దిగారు. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. చాలా వరకు కొత్త వాళ్లనే తన పార్టీ తరఫు నుంచి ఎన్నికల బరిలోకి దింపారు. ఎన్నికల హామీలు కూడా ప్రజలను ఆకర్షించే విధంగా రూపొందించారు. టీవీకే అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి ఇస్తామని, యువతకు విద్య కోసం రూ.20 లక్షల సహయం చేస్తామని విజయ్ తెలిపారు. అలాగే 75 శాతం ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా.. ‘నీ వల్లే ఇదంతా..’
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026.. రికార్డు స్థాయిలో ప్రైజీ మనీ ప్రకటించిన ఐసీసీ