Share News

పానీపూరీలో ఎలుక.. అయినా కూడా తినేశాడు..

ABN , Publish Date - Feb 16 , 2026 | 08:56 PM

పానీ బకెట్‌లో ఓ ఎలుక దర్శనం ఇచ్చింది. ఆ ఎలుక పానీలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉంది. అటు, ఇటు తిరుగుతూ ఉంది. పానీపూరీ అమ్మే వ్యక్తి ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

పానీపూరీలో ఎలుక.. అయినా కూడా తినేశాడు..
rat in golgappa video

ఇంటర్‌నెట్ డెస్క్: మీరు పానీపూరీ బండి దగ్గరకు వెళ్లి పానీపూరీ తింటూ ఉండగా.. పానీలో ఎలుక కనిపిస్తే ఏం చేస్తారు?.. సాధారణంగా నూటికి 99 శాతం మంది చేతిలో ఉన్న పానీపూరీలను అక్కడే పారేసి వెళ్లిపోతారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ యువకుడు ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. పానీలో ఎలుక కనిపించినా కూడా అతడు పానీపూరీ తిన్నాడు. అది కూడా 31 పానీపూరీలను తిన్నాడు. ఈ సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమృత్‌సర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కరణ్ ధంజు.. తన స్నేహితుడితో ఓ పందెం కాశాడు. ఎన్ని పానీపూరీలు తింటే అన్ని 50 రూపాయలు ఇస్తానన్నాడు. ఇద్దరూ కలిసి స్థానికంగా ఉండే పానీపూరీ బండి దగ్గరకు వెళ్లారు. పానీపూరీ అమ్మే వ్యక్తి ప్లేట్‌లో రెండు పానీపూరీలను పెట్టి ధంజు స్నేహితుడికి ఇచ్చాడు. అతడు తింటూ ఉండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పానీ బకెట్‌లో ఓ ఎలుక దర్శనం ఇచ్చింది. ఆ ఎలుక పానీలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉంది. అటు, ఇటు తిరుగుతూ ఉంది. పానీపూరీ అమ్మే వ్యక్తి ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీశాడు.


బకెట్ నుంచి కింద పడగానే ఆ ఎలుక బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టింది. అయితే, ఇంత జరిగినా ధంజు మిత్రుడు మాత్రం పోటీ ఆపడానికి ఒప్పుకోలేదు. పానీలో ఎలుక పడిందని తెలిసినా కూడా పందెం కొనసాగించాడు. ఏకంగా 31 పానీపూరీలు తిన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పానీపూరీ రుచిగా ఉండటానికి కారణమైన వాటిలో ఆ ఎలుక కూడా ఒకటి’.. ‘పానీలో ఎలుక పడిందని తెలిసినా అతడు ఎలా తిన్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

వందే భారత్‌ స్లీపర్‌, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ

రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ సమావేశం

Updated Date - Feb 16 , 2026 | 09:28 PM