Share News

నీటమునిగిన పట్టాలపై దూసుకెళ్లిన వందేభారత్.. చూసి తీరాల్సిన వీడియో

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:35 PM

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబైలో తాజాగా ఒక ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. నీటమునిగిన పట్టాలపై వందేభారత్‌ రైలు దూసుకెళ్లిన వైనం చూసి జనాలు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నీటమునిగిన పట్టాలపై దూసుకెళ్లిన వందేభారత్.. చూసి తీరాల్సిన వీడియో
Vandebharat train moving on Waterlogged Tracks

ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబైలో తాజాగా ఒక ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నీటమునిగిన పట్టాలపై వందేభారత్‌ రైలు దూసుకెళ్లిన వైనం చూసి జనాలు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, భారీ వర్షం కారణంగా ముంబైలోని ఒక ప్రాంతంలో పట్టాలపైకి నీరు చేరింది. అదే పట్టాలపై ఒక వందేభారత్ రైలు వేగంగా దూసుకెళ్లడంతో నీరు పెద్ద ఎత్తున ఎగసిపడింది. సినీఫక్కీలో రైలు రెండు వైపుల నుంచి నీరు ఎగసిపడటంతో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. వందేభారత్ ధాటికి నీరు పైనున్న వంతెనపై కూడా పడ్డట్టు వీడియోలో కనిపించింది.


ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. చిన్నతనంలో వాన నీటిలో ఆడుకుని పిల్లలు సంబరపడ్డట్టు రైలు డ్రైవర్ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఉంటాడని కొందరు కామెంట్ చేశారు. వందేభారత్ రైళ్లను ఎంత పటిష్ఠంగా నిర్మించారో ఈ ఉదంతం చెబుతోందని మరికొందరు అన్నారు. కొందరు మాత్రం ముంబైలో మౌలిక వసతుల్లోని లోపాలను ఎత్తిచూపారు.

కొద్ది రోజులుగా వానలతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీలైన రూట్లల్లో రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ వీడియోపై రైల్వే శాఖ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

మూఢనమ్మకాలతో చిక్కులు.. ఈ యువకుడి పరిస్థితి చూస్తే..

ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..

Updated Date - Jul 05 , 2026 | 06:13 PM