Share News

మూఢనమ్మకాలతో చిక్కులు.. ఈ యువకుడి పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:43 PM

మూఢనమ్మకాలను వదిలించుకోలేని ఒక యువకుడికి ఇటీవల చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.

మూఢనమ్మకాలతో చిక్కులు.. ఈ యువకుడి పరిస్థితి చూస్తే..
Eye Twitching Superstition Leads to Retinal detachment

ఇంటర్నెట్ డెస్క్: మూఢనమ్మకాలను వదిలించుకోలేని ఒక యువకుడికి ఇటీవల చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎడమ కన్ను అదిరితే చైనా వారు సంపదలు వస్తాయని భావిస్తున్నారు. కుడి కన్ను అదిరితే ఏదో విపత్తు రాబోతోందని తెగ టెన్షన్ పడిపోతారు. హుబే ప్రావిన్స్‌కు చెందిన లీ అనే వ్యక్తికి ఇటీవల కుడి కన్ను అదరడంతో అతడు తెగ హైరానా పడిపోయాడు. ముప్పును ఎలాగైనా తప్పించాలనుకున్నాడు.


కన్ను అదరకుండా ఉండేందుకు తొలుత అతడు కంటిపై వెచ్చని వస్త్రాన్ని పెట్టాడు. కానీ కన్ను అదరడం ఆగలేదు. దీంతో, అతడిలో భయం మరింత పెరిగింది. డాక్టర్ వద్దకు వెళ్లాలన్న విషయాన్నే అతడు మర్చిపోయి ఇంటర్నెట్‌లో తన ప్రశ్నలకు సమాధానాలు వెతికాడు. అదురుతున్న కంటి చుట్టూ అరచేతితో చరుచుకుంటే రాబోయే విపత్తు తొలగిపోతుందని నెట్టింట ఎవరో రాసుకొచ్చారు. ఈ పోస్టును చూడగానే అతడికి నమ్మకం కుదరడంతో ముందూ వెనుకా ఆలోచించకుండా చేయితో కంటి చుట్టూ వరుసగా మూడు రోజుల పాటు చరుచుకున్నాడు. దీంతో, కన్ను అదరడం ఆగిపోయింది. ఆ తరువాత అసలు సమస్య మొదలైంది.


మూడు రోజుల తరువాత అతడి పెరిఫెరల్ విజన్ పూర్తిగా పోయింది. కేవలం ఎదురుగా ఉన్నది మాత్రమే కనిపించే స్థితి దాపురించింది. దీంతో, మరింత కంగారు పడ్డ లీ డాక్టర్ వద్దకు వెళ్లగా అతడి రెటీనా స్థానభ్రంసం చెందినట్టు వైద్యులు తెలిపారు. రెటీనాను చక్కదిద్దేందుకు సర్జరీ అవసరం అని అన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అతడి చూపు మళ్లీ కుదుట పడింది.


ఈ వార్తలనూ చదవండి:

పాడైన హెడ్‌లైట్స్.. మొబైల్ టార్చ్ వెలుగులో బస్సును తోలిన డ్రైవర్

భర్తకు 20 నిద్రమాత్రలు ఇచ్చి హత్య.. కేసులో సంచలన విషయాలు...

Updated Date - Jul 05 , 2026 | 04:50 PM