Share News

పాడైన హెడ్‌లైట్స్.. మొబైల్ టార్చ్ వెలుగులో బస్సును తోలిన డ్రైవర్

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:36 PM

రాత్రివేళ హెడ్‌లైట్స్ పనిచేయకపోవడంతో ఒక డ్రైవర్ ఆర్టీసీ బస్సును మొబైల్ టార్చ్ వెలుగులో నడిపిన ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది.

పాడైన హెడ్‌లైట్స్.. మొబైల్ టార్చ్ వెలుగులో బస్సును తోలిన డ్రైవర్
Karnataka RTC Bus Faulty Headlights

ఇంటర్నెట్ డెస్క్: రాత్రివేళ హెడ్‌లైట్స్ పనిచేయకపోవడంతో ఒక డ్రైవర్ మొబైల్ టార్చ్ వెలుగులో ఆర్టీసీ బస్సును తోలిన ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది. కండక్టర్ సెల్ ఫోన్‌ లైట్ వెలుతురులో దారి చూపిస్తుండగా డ్రైవర్ బస్సును ప్రమాదకర రీతిలో ముందుకు నడిపాడు. ఇటీవల కులబురగీ నుంచి చించోలికి బయలుదేరిన చివరి బస్సులో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి వేళ సెల్‌ఫోన్ వెలుతురులోనే ఆ డ్రైవర్‌ బస్సును ముందుకు తోలాడు. హెడ్‌లైట్స్‌ ఎప్పుడు పాడైందీ ఇంకా తెలియరాలేదు. ప్యాసింజర్లకు కూడా మరో మార్గం లేక అలాగే ప్రయాణించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ పనితీరుపై మరికొందరు ప్రశ్నలు లేవనెత్తారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా అంతటి భారీ వాహనాన్ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై వర్షాల్లో ట్రాక్‌పై ఉన్న కుక్కను రక్షించిన లోకో పైలట్.. వీడియో వైరల్

భార్యను కాపురానికి పిలిచినందుకు ఘోరం.. బావకు నిప్పంటించి చంపిన బావమరిది..

Updated Date - Jul 05 , 2026 | 03:46 PM