ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:16 PM
ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్లాడుకోవటం చూస్తుంటాం. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కదులుతున్న రైలులో ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్లాడుకోవటం చూస్తుంటాం. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, కదులుతున్న రైలులో ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. అందులో ఓ వ్యక్తి.. మరో వ్యక్తిని కిందికి తోసేశాడు. ఈ ఘటన ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రయాణికులతో రైలు బోగీ కిక్కిరిసి పోయి ఉంది. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతున్నారు. అందులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేస్తున్నాడు. అతడు క్షమించమని కోరుతున్నాడు. ఆ దాడిని ఆపేందుకు రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తితోపాటు మరో వ్యక్తి ప్రయత్నిస్తున్నారు. కానీ దాడిని మాత్రం అతడు ఆపడడం లేదు. చేతులతోపాటు కాళ్లతో నిరంతరాయంగా క్షమాపణలు చెప్పిన వ్యక్తిపై దాడి చేస్తూనే ఉన్నాడు.
రైలు స్టేషన్ సమీపిస్తున్న క్రమంలో దాడికి గురైన వ్యక్తి రైలు బోగీ గేటు వద్దకు వెళ్లాడు. అతడిపై బలంగా కాలితో దాడి చేయడంతో బోగీలో నుంచి కింద పడిపోయాడు. ఈ దాడి జరిగిన బోగీలో చాలా మంది ప్రయాణికులు ఉన్నా.. వారంతా ప్రేక్షకుల్లా చూస్తున్నారు. అంతేగాని ఆ ఇద్దరిని విడదీసి.. సర్ది చెప్పే ప్రయత్నం ఒకరిద్దరు మినహా ఎవరూ చేయలేదు. మరికొందరు అయితే ఈ ఘర్షణను తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించే పనిలో ఉన్నారు.
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను వారు కోరుతున్నారు. అలాగే రైలు బోగీల్లో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణించాలంటే భయంగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
గత నెల (జూన్) చివరి వారంలో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ఓ ప్రయాణికుడ్ని మరో ప్రయాణికుడు కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య జరిగిన సమయంలో కూడా వారిని వారించేందుకు ఎవరూ ప్రయత్నించ లేదు. దీంతో ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొందనే చర్చ జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భర్తకు 20 నిద్రమాత్రలు ఇచ్చి హత్య.. కేసులో సంచలన విషయాలు..
భార్యను కాపురానికి పిలిచినందుకు ఘోరం.. బావకు నిప్పంటించి చంపిన బావమరిది..