రూ.700ల వందేభారత్ టికెట్ రూ.380కి.. టీటీఈపై వేటు
ABN , Publish Date - May 13 , 2026 | 02:03 PM
వందేభారత్ టికెట్‌ను తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీటీఈపై రైల్వే వేటు వేటువేసింది. ఆయనను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: వందేభారత్ రైలు టికెట్‌ను ఒక టీటీఈ తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో రైల్వే స్పందించింది. ఆ టీటీఈని సస్పెండ్ చేసినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది. టికెట్‌కు సంబంధించి టీటీఈ, ప్యాసింజర్ మధ్య జరిగిన సంవాదం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ప్యాసింజర్ అడిగింది సాధ్యం కాదని మొదట టీటీఈ తెలిపారు. ఆ తరువాత రూ.380కు టికెట్ ఏర్పాటు చేయగలనని చెప్పారు. తన ద్వారా కాకుండా నేరుగా టికెట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే రూ.700 చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఈ క్రమంలో ప్యాసింజర్ మరికొన్ని ప్రశ్నలు అడగ్గా టీటీఈ ఏవో సమాధానాలు ఇచ్చారు.
అసలు వారి మధ్య ఏం జరిగింది? అనే విషయంపై పూర్తి వివరాలు లేకున్నా జనాల్లో వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. సంబంధిత టీటీఈని సస్పెండ్ చేసినట్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రభుత్వాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న భావన ఇలాంటి ఉదంతాలతో మరింత బలపడుతుందని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
భారత రియలెస్టేట్ రంగంపై ఎన్నారై మహిళ కామెంట్.. నెట్టింట పోస్టు వైరల్
ఆ మహిళ తన భార్యే అని తెలియక భర్త చాటింగ్! చివరకు..