ఆ మహిళ తన భార్యే అని తెలియక భర్త చాటింగ్! చివరకు..
ABN , Publish Date - May 06 , 2026 | 04:05 PM
నాలుగేళ్లుగా పుట్టింట్లో ఉంటున్న ఒక వివాహిత ఫేక్ ఐడీతో ఆన్‌లైన్‌లో భర్తతో చాటింగ్ ప్రారంభించింది. పరిచయం పెరగడంతో మహిళను కలుసుకునేందుకు వెళ్లిన భర్త అక్కడ భార్యను చూసేసరికి షాకైపోయాడు. యూపీలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తన భర్తతో చాటింగ్ చేసింది. ఆ మహిళ తన భార్యే అని తెలియక ఆ వ్యక్తి ఆమెను కలుసుకునేందుకు వెళ్లాడు. చివరకు భార్య ఎదురుపడే సరికి షాకైపోయాడు. ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోనీ అనే మహిళకు ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన ప్రభుదత్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భర్తతో గొడవల కారణంగా సోనీ నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ భార్యాభర్తలు విడిగానే ఉంటున్నారు. అయితే, ఇటీవల సోనీ ఇన్‌స్టాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి భర్తతో చాట్ చేయడం ప్రారంభించింది. ఆమె ఎవరో తెలుసుకోలేకపోయిన ప్రభుదత్ చాటింగ్ ప్రారంభించాడు. చివరకు ఒక రోజు ఆమెను కలుసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడిని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఒక దేవాలయానికి రమ్మని సోనీ చెప్పింది. తన ముఖం కనబడకుండా స్కార్ఫ్‌ను చుట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఆమె అక్కడకు వెళ్లింది.
ఆమె ఎవరో గుర్తించలేకపోయిన ప్రభుదత్ యథాప్రకారం ఆమెతో చిట్‌చాట్ ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆమె స్కార్ఫ్ తొలగించగానే ఒక్కసారిగా షాకైపోయాడు. సోనీ వెంట దేవాలయానికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులు ఇదంతా దూరం నుంచి గమనించసాగారు. అయితే, భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో ప్రభుదత్ ఆమెపై చేయి చేసుకున్నాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. వెంటనే రంగంలోకి దిగిన సోనీ కుటుంబసభ్యులు అతడిని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు, అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
వామ్మో.. ఈ వధువుకు ధైర్యమెక్కువ.. సుడిగాలి కమ్మేస్తుంటే ఏం చేసిందో చూడండి..
దుబాయ్‌లో భారతీయ డ్రైవర్‌కు కళ్లు చెదిరే లాటరీ