Share News

దుబాయ్‌లో భారతీయ డ్రైవర్‌కు కళ్లు చెదిరే లాటరీ

ABN , Publish Date - May 04 , 2026 | 09:55 PM

దుబాయ్‌లోని ఒక భారతీయ డ్రైవర్‌కు తాజాగా బంపర్ లాటరీ దక్కింది. లాటరీలో ఆయన రూ.64 కోట్ల పైచిలుకు మొత్తాన్ని గెలుచుకున్నారు.

దుబాయ్‌లో భారతీయ డ్రైవర్‌కు కళ్లు చెదిరే లాటరీ
Indian driver in Dubai Wins Big Ticket Lotter

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో ఉంటున్న ఓ భారతీయుడికి బంపర్ లాటరీ దక్కింది. అబ్దుల్ రషీద్ అనే డ్రైవర్ బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌ల జాక్‌పాట్‌ను (రూ.64,59,53,000) గెలుచుకున్నారు.

కేరళంకు చెందిన రషీద్ 17 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు. డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుటుంబం భారత్‌లో ఉంది. గత ఆరేళ్లుగా ఆయన క్రమం తప్పకుండా బిగ్ టికెట్ లాటరీలో పాల్గొంటున్నారు. ఈమారు ఏప్రిల్ 19న కొన్న టికెట్‌తో ఆయనను అదృష్టం వరించింది.


ఇంత భారీ లాటరీ గెలుచుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని రషీద్ తెలిపారు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులతో ఉండగా నాకు ఈ విషయం తెలియడంతో మరింత సంతోషం కలిగింది’ అని అన్నారు. స్నేహితులు, కుటుంబంతో వివరంగా చర్చించాక డబ్బును ఎలా వినియోగించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటానని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రాల్లో పాల్గొంటానని చెప్పారు.

ఇదిలా ఉంటే అబుదాబీలో ఉంటున్న మరో కేరళం వ్యక్తి అషారఫ్ అబ్దుల్లా కూడా డ్రీమ్ కార్ కేటగిరీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను గెలుచుకున్నారు. దాదాపు 9 ఏళ్లుగా ఆయన లాటరీ టిక్కెట్లు కొంటుండగా ఈసారి అదృష్టం వరించింది. 16 ఏళ్లుగా తాను యూఏఈలో ఉంటున్నానని ఆయన తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

తలలో కత్తి దిగినా ఫోన్ చూస్తున్న యువకుడు.. షాకింగ్ వీడియో..

సోషల్ మీడియా క్రేజ్: కదులుతున్న రైలులో సీటు ధ్వంసం.. వీడియో వైరల్

Updated Date - May 04 , 2026 | 10:06 PM