సోషల్ మీడియా క్రేజ్: కదులుతున్న రైలులో సీటు ధ్వంసం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 04 , 2026 | 03:16 PM
సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకూ శ్రుతిమించుతోంది. లైకులు, వ్యూస్ కోసం కొందరు వ్యక్తులు చేస్తున్న వికృత చేష్టలు హద్దులు దాటుతున్నాయి. రైలులో ఓ యువకుడు సీటు కవర్‌ను చింపివేస్తూ రీల్స్ చేయడం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకూ శ్రుతిమించుతోంది. లైకులు, వ్యూస్ కోసం కొందరు వ్యక్తులు చేస్తున్న వికృత చేష్టలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా, కదులుతున్న రైలులో ఓ యువకుడు సీటు కవర్‌ను చింపివేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో.. రద్దీగా ఉన్న ఒక జనరల్ కోచ్‌లో ఒక వ్యక్తి బెంచ్ సీటును చింపివేస్తుండగా, మరో వ్యక్తి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్నాడు. అదే సమయంలో, అతనితో ఉన్న మరికొందరు వీడియో తీస్తున్న వ్యక్తి వెనుక విన్యాసాలు చేస్తూ కనిపించారు. కేవలం సోషల్ మీడియాలో కంటెంట్ కోసం, ప్రజా ఆస్తిని ఇలా బాధ్యతారహితంగా ధ్వంసం చేయడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇలాంటి వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేయగా, ‘ఈ మూర్ఖులు దీన్ని చూసి తెగ ఆనందిస్తున్నారు. ఇలాంటి వాళ్లపై కఠినంగా వ్యవహరించాలి’ ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి వాళ్లు చెదపురుగు కంటే హీనం’అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.