ఇది రైలా? ఫైవ్ స్టార్ హోటలా! వందేభారత్ స్లీపర్ లోపలి ఏర్పాట్లు చూస్తే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:19 PM
వందే భారత్ స్లీపర్ రైలు లోపలి ఏర్పాట్లను చూపించే ఓ వీడియో ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ రైలుపై దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ వందే భారత్ రైళ్లన్నీ పగటి పూట జర్నీలకే పరిమితం కాగా తొలిసారిగా రైల్వే ఈ బ్రాండ్ పేరిట స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ రైలు ప్రస్తుతం హౌరా (పశ్చిమ బెంగాల్), గువాహటీ (అస్సామ్) మధ్య పరుగులు పెడుతోంది. మెజారిటీ దేశ ప్రజలకు ఈ రైల్లో ఫీచర్ల గురించి తెలుసు కానీ ఇందులో ప్రయాణించే అవకాశం మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి. అయితే, ఈ రైల్లో ప్రయాణించిన వారు తమ అనుభవాలను పంచుకుంటూ నెట్టింట పోస్టు చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి (Vandebharat Interiors - Viral Video).
వందేభారత్ స్లీపర్‌లో ప్రయాణించిన వారందరూ రైల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్థాయి వసతులు ఉన్నాయని తెగ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా, ఈ రైల్లోని ప్రతి ఫీచర్‌ను చక్కగా వివరిస్తూ వీడియోలు చేసి నెట్టింట పంచుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. బెర్తులను ఏర్పాటు చేసిన తీరు, సౌకర్యాలు, డోర్ల లాకింగ్ మెకానిజం, కిటికీలకు ఏర్పాటు చేసిన తెరలు, లోపల గాలి సర్క్యులేట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెంట్స్.. ఇలా ఏ అంశాన్నీ విడిచిపెట్టకుండా ఓ వ్యక్తి వీడియోను షేర్ చేశారు.
ఇంత విపులంగా రైలులోపలి ఏర్పాట్లను వివరించిన ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది అనేక మందికి తమ బాధ్యతను కూడా గుర్తు చేస్తోంది. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన రైలును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ రైలు విషయంలోనైనా ప్రజలు కాస్త పౌరస్పృహతో నడుచుకుంటారని ఆశిస్తున్నట్టు కొందరు కామెంట్ చేశారు. మరి ఇంతలా వైరల్ అవుతున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
నా బిడ్డను వెలేశారు.. ఓ తండ్రి పోస్టు నెట్టింట వైరల్
వందే భారత్ స్లీపర్‌లో షాకింగ్ సీన్.. మీరెందుకు మారరు బ్రో?