Share News

స్కూటీతో ఏనుగును ఢీకొట్టిన మహిళా టీచర్.. పాపం ఆ ఏనుగు..

ABN , Publish Date - May 21 , 2026 | 08:52 PM

ఏనుగును స్కూటీ ఢీకొన్న ఘటనలో ఏనుగు తీవ్రంగా గాయపడింది. దాని దంతాలు విరిగి రోడ్డుపై పడిపోయాయి. ఉత్తరాఖండ్‌లో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

స్కూటీతో ఏనుగును ఢీకొట్టిన మహిళా టీచర్.. పాపం ఆ ఏనుగు..
Uttarakhand elephant incident

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఏనుగును స్కూటీ ఢీకొన్న ఘటనలో ఏనుగు తీవ్రంగా గాయపడింది. దాని దంతాలు విరిగి రోడ్డుపై పడిపోయాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా టీచర్ తన యాక్టీవా స్కూటీపై ఖతిమా రోడ్డుపై వెళుతోంది. రోడ్డు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోనుంచి ఓ ఏనుగు సడెన్‌గా రోడ్డుపైకి వచ్చింది. స్కూటీ వేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టింది. దీంతో ఏనుగు కిందపడిపోయింది. దాని దంతాలు విరిగి పోయాయి.


స్కూటీ దెబ్బకు భయపడిపోయిన ఏనుగు పైకి లేచి అడవిలోకి పరుగులు పెట్టింది. ఏనుగును ఢీకొట్టడం వల్ల స్కూటీ దెబ్బ తింది. మహిళా టీచర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు మహిళా టీచర్‌‌కు సాయం చేశారు. దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్ దెబ్బకు ఏనుగు చాలా భయపడిపోయింది. కిందపడ్డ అది పైకి లేచి అడవిలోకి పరుగులు పెట్టింది. ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతుంటాయి’ అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

యూపీలోని బాందా జిల్లాలో వరుసగా మూడో రోజూ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం మానుకోవాలి : మంత్రి నాదెండ్ల మనోహర్

Updated Date - May 21 , 2026 | 09:05 PM