జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం మానుకోవాలి : మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - May 21 , 2026 | 08:18 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానం.. అరకొర సమాచారంతో మాట్లాడటం మానుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.
అమరావతి, మే 21: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానం.. అరకొర సమాచారంతో మాట్లాడటం మానుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కష్టించిన డబ్బుతో ప్రజా పర్యటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ హయాంలో హెలికాప్టర్ల కోసమే రూ.222 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ మావిగన్ అని జగన్ అంటే జనం నవ్వుకుంటున్నారు. అధికారంలో ఉన్నపుడు అమరావతి రైతుల ఉసురు తీశారు’..
‘దీపం-2 పథకానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులకు అందించే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కోసం సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ సరఫరా చేస్తున్నాం. ప్రతి రైస్ బ్యాగ్‌పై రైతుల వివరాలతో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాం. రైతుల త్యాగాన్ని గుర్తించకుండా జగన్ మాట్లాడటం దురదృష్టకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన ఖండిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగిన అవగాహనతో జగన్ మాట్లాడాలి. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
గుడ్ న్యూస్.. నాలుగు యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి