ఉత్తరాఖండ్‌లో ఏనుగు బీభత్సం.. బైకర్‌పై రెండుసార్లు దాడి.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:01 PM
అడవి ఏనుగు ఎదురుగా వస్తేనే గుండెల్లో దడ పుడుతుంది. అలాంటిది ఏకంగా ఓ బైకర్‌పై రెండుసార్లు కాలు వేసినా.. అతడు ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై నవంబర్ 12న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేపాలీ ఫామ్ సమీపంలో ఓ బైకర్ ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన అడవి ఏనుగు ఒక్కసారిగా అతడి వద్దకు దూసుకొచ్చింది. రోడ్డుపై పడిపోయిన బైకర్ ఛాతీ, కడుపుపై ఏనుగు రెండుసార్లు కాలు వేసింది. ఈ భయానక దృశ్యాలను అదే మార్గంలో వెళ్తున్న క్యాబ్ డ్రైవర్.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ శివ శర్మ తన కెమెరాలో బంధించారు. ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు స్థానికులు కేకలు వేయడంతో కొద్దిసేపటి తర్వాత అది రోడ్డు పక్కనున్న భద్రతా కంచె దాటి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం బైకర్ నెమ్మదిగా లేచి నిలబడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనలో బైకర్ ప్రాణాలతో బయటపడటం నిజంగా ఆశ్చర్యకరమని శివ శర్మ పేర్కొన్నారు. హరిద్వార్-డెహ్రాడూన్ మార్గంలో ఏనుగులు తరచూ రోడ్లపైకి వస్తుంటాయని.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ హైవే రాజాజీ టైగర్ రిజర్వ్ సమీపంలో ఉండటంతో పాటు ఏనుగులు.. ఇతర వన్యప్రాణుల సంచారానికి కీలకమైన ప్రాంతాల గుండా వెళ్తుంది. జాలీ గ్రాంట్ విమానాశ్రయ పరిసరాలు సైతం ఏనుగుల సంచార మార్గాల్లో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఈ మార్గంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు.
ఈ వార్తలూ చదవండి
బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు
ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్