Share News

Man Holds Woman: బట్టల షాపులో యువకుడి దారుణం.. యువతి గొంతు మీద కత్తి పెట్టి..

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:23 PM

ఓ యువకుడు బట్టల షాపులోకి చొరబడి ఓ యువతిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆమె పీక మీద కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. లక్ష రూపాయలు ఇస్తే కానీ యువతిని వదిలిపెట్టనని అన్నాడు.

Man Holds Woman: బట్టల షాపులో యువకుడి దారుణం.. యువతి గొంతు మీద కత్తి పెట్టి..
Man Holds Woman

ఈజీ మనీ కోసం ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బట్టల షాపులోకి చొరబడి ఓ యువతిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆమె పీక మీద కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. లక్ష రూపాయలు ఇస్తే కానీ యువతిని వదిలిపెట్టనని అన్నాడు. అయితే, పోలీసుల రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. అతడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం బిజ్‌నోర్‌లోని నజీబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ బట్టల షాపులో ఓ యువతి షాపింగ్ చేస్తూ ఉంది.


రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అజిత్ అనే వ్యక్తి షాపులోకి ప్రవేశించాడు. కత్తితో బెదిరించి ఓ అమ్మాయిని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆమె పీక మీద కత్తి పెట్టి లక్ష రూపాయలు ఇస్తేనే వదులుతానంటూ బెదిరింపులకు దిగాడు. భయంతో ఆ యువతి గట్టిగా కేకలు పెట్టసాగింది. దీంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. అతడికి సర్ధిచెప్పి యువతిని కాపాడే ప్రయత్నం చేశారు. అతడు ఏమాత్రం వారి మాట వినలేదు. దాదాపు అరగంట పాటు అక్కడి జనం ఎంతో ప్రయత్నించారు. 8 గంటల ప్రాంతంలో ఎలాగైతేనేం అందరూ కలిసి అతడ్ని పట్టేసుకున్నారు.


తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అతడికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఆమెకు ఏమైనా అయితే అక్కడి వాళ్లు ఊరికే వదిలిపెడతారా?’..‘బాగా తాగినట్లు ఉన్నాడు. అడ్డంగా దొరికిపోయాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఐదు గంటల్లో కేవలం 46 కి.మీ.. దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు గురించి తెలుసా..

ఆ ఘటన నా పూర్వజన్మ సుకృతం.. ఎంపీ కలిశెట్టి కీలక వ్యాఖ్యలు

Updated Date - Jan 01 , 2026 | 08:52 PM