Share News

Devotees Worship Viral Dog: కుక్కను దైవంలా పూజిస్తున్న భక్తులు.. పునర్జన్మ ఎత్తిందంటూ..

ABN , Publish Date - Jan 17 , 2026 | 07:10 AM

హనుమాన్, దుర్గామాతల విగ్రహాల చుట్టూ తిరిగి ఓ వీధి కుక్క సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ కుక్క గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి రావటమే కాదు.. దానికి పూజలు చేయటం మొదలుపెట్టారు.

Devotees Worship Viral Dog: కుక్కను దైవంలా పూజిస్తున్న భక్తులు.. పునర్జన్మ ఎత్తిందంటూ..
Devotees Worship Viral Dog

హనుమాన్, దుర్గామాతల విగ్రహాల చుట్టూ తిరిగి ఓ వీధి కుక్క సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఆ కుక్క విగ్రహాల చుట్టూ తిరిగింది. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం తిరగటం ఆపి గుడిలో ఓ చోట కూర్చుంది. ఆ కుక్క గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి రావటమే కాదు.. దానికి పూజలు చేయటం మొదలుపెట్టారు. అది నిద్రపోవటానికి గుడిలో ఓ చోట బెడ్ షీట్ ఏర్పాటు చేశారు. ఆ బెడ్ షీట్ మీద అది నిద్రపోగా.. భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని మొక్కుతున్నారు. ఓ వ్యక్తి భక్తుల నుంచి దానికి ఇబ్బంది కలగకుండా ఉండేలా పక్కనే కాపలా ఉంటున్నాడు.


పోయిన జన్మలో ఆ కుక్క హనుమాన్ భక్తుడు అయి ఉంటుందని, పునర్జన్మ ఎత్తిందని భక్తులు అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. ఆ కుక్క పునర్జన్మ ఎత్తిందని కొంతమంది.. లేదు, లేదు ఆ కుక్క అనారోగ్యంతో బాధపడుతోందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్, బిజ్‌నూర్ జిల్లాలోని నందపూర్ గ్రామం, నగినా ఏరియాలో ఓ హనుమాన్ గుడి ఉంది. సోమవారం ఉదయం ఓ కుక్క గుడి దగ్గరకు వచ్చింది. నేరుగా గర్భగుడిలోకి వెళ్లింది. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగటం మొదలెట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. గంటలు గడుస్తున్నా అది విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడు రోజులు గడిచిపోయాయి. అది ప్రదక్షిణలు ఆపేసింది. కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంది. అందరూ అది తిరగటం ఆపేసింది అనుకున్నారు. వారు ఊహించని విధంగా అది మళ్లీ ప్రదక్షిణలు మొదలెట్టింది. ఈ సారి దుర్గామాత విగ్రహం చుట్టూ తిరగటం మొదలెట్టింది. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం తిరగటం ఆపి గుడిలో ఓ చోట కూర్చుంది.


ఇవి కూడా చదవండి

పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం..

ఔను.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది

Updated Date - Jan 17 , 2026 | 07:57 AM