మానవత్వం అంటే ఇదే కదా.. ఆవును రక్షించటం కోసం తన ప్రాణాలను..
ABN , Publish Date - Aug 22 , 2026 | 02:47 PM
ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఆవును రక్షించటం కోసం ఓ బైకర్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. పక్కనే ఉండి మరీ ఆవును రోడ్డు దాటించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఆవును రక్షించటం కోసం ఓ బైకర్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. పక్కనే ఉండి మరీ ఆవును రోడ్డు దాటించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఆవు ఘజియాబాద్‌లోని ఓ బిజీ రోడ్డుపైకి వచ్చింది. అటు, ఇటు వేగంగా వెళుతున్న వాహనాల మధ్య చిక్కుకుపోయింది. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై పరిగెత్తసాగింది. ఓ బైకర్ దాన్ని చూశాడు. ఎంతో గొప్ప మనసుతో దానికి సాయం చేయాలని భావించాడు.
రోడ్డుపై పరిగెడుతున్న ఆవు పక్కనే బైక్‌ను నడిపాడు. ఇలా చేయటం ద్వారా రోడ్డుపై వెళుతున్న వాహనాలు దాని వైపు రాలేదు. ఆ ఆవు కూడా బైకర్‌ను దాటి పక్కకు వెళ్లడానికి ప్రయత్నించలేదు. డివైడర్, బైకర్ మధ్యలో పరిగెత్త సాగింది. డివైడర్ లేకుండా ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆవు రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా ఆ బైకరే దానికి సాయం చేశాడు. దగ్గరుండి మరీ దాన్ని రోడ్డు దాటించాడు. ఆ ఆవు క్షేమంగా ఫుట్‌పాత్ పైకి చేరుకుంది. ఈ మొత్తం సంఘటనను శ్రీ శుధ్ అనే వ్యక్తి వీడియో తీశాడు.
ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆ బైకర్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘ఆవు కోసం నీ ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం అవసరమా?. ఆవులు చాలా తెలివైనవి. వాటికి రోడ్డు ఎలా దాటాలో తెలుసు’..‘మంచికిపోయి నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా?. నీకసలు తెలివి లేదు’..‘ ఆ బైకర్ చేసిన మంచి పనిని అందరూ మెచ్చుకోవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తాం: వీహెచ్
జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి