విజయ్ ప్రమాణ స్వీకారం క్యాన్సిల్.. స్టేడియం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న మద్దతుదారులు
ABN , Publish Date - May 07 , 2026 | 01:52 PM
గురువారం ఉదయం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాన్సిల్ అయింది. ఈ విషయం తెలియని విజయ్ మద్దతుదారులు రాష్ట్రం నలుమూలల నుంచి స్టేడియం దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాన్సిల్ అయిందని తెలిసి షాక్ అయ్యారు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
చెన్నై, మే 7: కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ రోజు (గురువారం) ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, మెజార్టీ లేని కారణంగా.. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ నిరాకరించారు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాన్సిల్ అయింది. ఈ విషయం తెలియని విజయ్ మద్దతుదారులు రాష్ట్రం నలుమూలల నుంచి స్టేడియం దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చేశారు.
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాన్సిల్ అయిందని తెలిసి షాక్ అయ్యారు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాము. కానీ, ఇక్కడ ఏమీ లేదు. గేట్లు మూసి ఉన్నాయి. మాకు చాలా బాధగా ఉంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరికొంతమంది మద్దతుదారులు మాట్లాడుతూ.. మీడియా, సోషల్ మీడియా వార్తల కారణంగానే తాము గురువారం తెల్లవారుజామునే స్టేడియం దగ్గరకు వచ్చామన్నారు. కార్యక్రమం క్యాన్సిల్ చేస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
కారణం ఇదే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించింది. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి. ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత బల నిరూపణకు వెళదామని విజయ్ భావించారు. నిన్న (బుధవారం) గవర్నర్ అర్లేకర్‌ను కలిశారు. అయితే, మెజార్టీ లేకపోవటంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నిరాకరించారు. దీంతో ఈ రోజు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం క్యాన్సిల్ అయింది.
ఇవి కూడా చదవండి
ఇంట్లో వృద్ధులు ఉన్నారా? ఈ కిట్ తప్పనిసరి
గుంతకల్లు-వాడి రైల్వేలైన్ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్