ఇంట్లో వృద్ధులు ఉన్నారా? ఈ కిట్ తప్పనిసరి
ABN , Publish Date - May 07 , 2026 | 01:39 PM
ఇంట్లో 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు జెరియాట్రిక్ కిట్ లేదా సీనియర్ సిటిజన్ కేర్ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే ఇంట్లో 'జెరియాట్రిక్ కిట్' లేదా 'సీనియర్ సిటిజన్ కేర్ కిట్' ఉండటం చాలా ఉపయోగకరం. ఈ కిట్ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. ఆసుపత్రికి వెళ్లే వరకు అవసరమైన ప్రథమ చికిత్స అందించడంలో ఇది సహాయపడుతుంది.
వృద్ధుల కిట్ అంటే ఏమిటి?
వృద్ధుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసే ప్రత్యేక మెడికల్ కిట్‌ను జెరియాట్రిక్ కిట్ అంటారు. ఇందులో రోజువారీ ఉపయోగించే మందులు, ప్రథమ చికిత్స సామగ్రి, అలాగే కొన్ని ముఖ్యమైన వైద్య పరికరాలు ఉంటాయి.
ఈ కిట్‌లో సాధారణంగా ఉండే వస్తువులు:
బీపీ చెక్ చేసే యంత్రం
థర్మామీటర్
పల్స్ ఆక్సీమీటర్
షుగర్ టెస్ట్ చేసే పరికరం
వినికిడి పరికరం
వెయింగ్ మిషన్
నొప్పి నివారణ మందులు
బ్యాండేజీలు
యాంటీసెప్టిక్ క్రీమ్
వైద్యులు సూచించిన ఇతర మందులు
మందుల గడువు తేదీలను తరచూ పరిశీలించడం కూడా చాలా ముఖ్యం.
ఈ కిట్ ఎందుకు అవసరం?
60 ఏళ్లు దాటినవారిలో ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా రావచ్చు. చిన్న సమస్య కూడా కొన్నిసార్లు పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఈ కిట్ ఉంటే వెంటనే ప్రాథమిక చికిత్స అందించవచ్చు. దీంతో పరిస్థితిని కొంతవరకు అదుపులో ఉంచడం సులభమవుతుంది.
కిట్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి?
ముందుగా వైద్యులని సంప్రదించాలి.
వృద్ధుల ఆరోగ్య పరిస్థితికి తగ్గ వస్తువులను ఎంపిక చేసుకోవాలి.
అన్ని వస్తువులను శుభ్రమైన డబ్బాలో సర్దుకోవాలి.
ఈ కిట్‌ను ఇంట్లో అందరికీ సులభంగా అందుబాటులో ఉండే చోట ఉంచాలి.
ఇంట్లో వృద్ధులు ఉంటే ఈ కిట్ తప్పనిసరిగా ఉండటం మంచిది. ఇది అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News