Share News

సీఎం విజయ్ పుట్టినరోజు.. స్పెషల్ ఫొటో విడుదల చేసిన త్రిష..

ABN , Publish Date - Jun 23 , 2026 | 09:33 PM

హీరోయిన్ త్రిష ఈ రోజు (మంగళవారం) సోషల్ మీడియా వేదికగా విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్‌తో దిగిన క్యాండిడ్ ఫొటోను ఆమె షేర్ చేశారు.

సీఎం విజయ్ పుట్టినరోజు.. స్పెషల్ ఫొటో విడుదల చేసిన త్రిష..
Thalapathy Vijay Birthday

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నిన్న (సోమవారం) 52వ పడిలోకి అడుగుపెట్టారు. తమిళనాడు వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు విజయ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ త్రిష ఈ రోజు (మంగళవారం) సోషల్ మీడియా వేదికగా విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్‌తో దిగిన క్యాండిడ్ ఫొటోను ఆమె షేర్ చేశారు. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టిన పోస్టులో..


‘నా జీవితానికి ఒక అర్ధాన్నిచ్చిన వ్యక్తికి... పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. హ్యాపీ బర్త్‌డే పక్కన లవ్ సింబల్‌ను కూడా జత చేశారు. త్రిష షేర్ చేసిన ఫొటోలో.. విజయ్ కేకు దగ్గర నిల్చుని కేకు వైపు చూస్తూ నవ్వుతున్నారు. త్రిష .. విజయ్ పక్కన నిల్చుని ఆయన వైపే చూస్తూ ఉన్నారు. త్రిష పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టు పెట్టిన గంటలోనే 1.5 మిలియన్ల లైకులు వచ్చాయి. ఇక, ఈ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ

సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు.. మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు

Updated Date - Jun 23 , 2026 | 09:42 PM