Share News

విజయ్ ప్రమాణ స్వీకారం.. వైరల్‌గా మారిన త్రిష కంటతడి వీడియో..

ABN , Publish Date - May 11 , 2026 | 07:10 AM

విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ఎమోషనల్ అయ్యారు.

విజయ్ ప్రమాణ స్వీకారం.. వైరల్‌గా మారిన త్రిష కంటతడి వీడియో..
Trisha Krishnan

ఇంటర్‌నెట్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ఎమోషనల్ అయ్యారు.


సంతోషంతో కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రిష సూష్మ అనే యువతి తన ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేసింది. ‘సీఎం జోషఫ్ విజయ్ స్పీచ్ సందర్భంగా త్రిష్ చాలా ఎమోషనల్ అయింది. విజయ్ స్పీచ్ మనసు హత్తుకునేలా ఉంది’ అని రాసుకొచ్చింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా కన్నీళ్లు తప్పకుండా వస్తాయి’..‘కొన్ని ఫీలింగ్స్‌ను మనసులో దాచుకోలేము’..‘ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సంతోషంగా ఉంది: త్రిష

త్రిష స్టేడియంలోకి అడుగుపెట్టగానే మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా త్రిష స్పందిస్తూ.. విజయ్ ప్రమాణ స్వీకారం చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారంపై త్రిషకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

విజయ్‌-రాహుల్‌ ఫొటో.. బ్లాక్‌ చేసిన ఇన్‌స్టా!

స్థిరంగా గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవీ

Updated Date - May 11 , 2026 | 07:18 AM