వావ్.. ఇలాంటి వ్యాపారం ఎవరూ చేయరేమో.. ఇతడి సూపర్ ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 07:04 PM
వ్యాపారంలో రాణించాలంటే సరికొత్తగా ఆలోచించాలి. ఎవరికీ రాని ఆలోచనను ఆచరణలో పెట్టి వ్యాపారం ప్రారంభించాలి. అలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు గొప్పగా విజయవంతమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
వ్యాపారంలో రాణించాలంటే సరికొత్తగా ఆలోచించాలి. ఎవరికీ రాని ఆలోచనను ఆచరణలో పెట్టి వ్యాపారం ప్రారంభించాలి. అలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు గొప్పగా విజయవంతమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో ఓ వ్యక్తి బిజినెస్ ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే. ఆ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు (unique business idea).
trolltadkaculture అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రెండు బకెట్లతో ఓ బ్రిడ్జ్‌పై నిల్చున్నాడు. ఒక బకెట్‌లో రోటీలు, మరో బకెట్‌లో రోటీ కర్రీ ఉన్నాయి. అతడి పక్కనే వరుసగా బిచ్చగాళ్లు ఉన్నారు. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లే వాళ్లను ఆ వ్యక్తి పిలుస్తున్నాడు. తన దగ్గర నుంచి రోటీలు కొని పక్కనే ఉన్న బిచ్చగాళ్లకు దానం చేయమని అడుగుతున్నాడు. తన దగ్గర వంద రూపాయలతో ఆహారం కొంటే ఐదుగురు బిచ్చగాళ్లకు సరిపోతుందని, రెండు వందల రూపాయలతో 11 మందికి ఆహారం లభిస్తుందని చెబుతున్నాడు (innovative business idea).
అతడు చెప్పేది విని అక్కడున్న వారు ఆశ్చర్యపోతున్నారు (trending video). ఈ సూపర్ బిజినెస్ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పది లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 1.5 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ బిజినెస్ ఐడియా సూపర్‌గా ఉందని ఒకరు ప్రశంసించారు. ఈ వ్యక్తి డిమాండ్‌ను స్వయంగా సృష్టించి, సరఫరా చేస్తున్నాడని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి.. కారణమేంటో తెలుసా?
సరికొత్తగా అమెరికా స్వరూపం.. కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలాతో కూడిన మ్యాప్‌ను షేర్ చేసిన ట్రంప్..