Share News

గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి.. కారణమేంటో తెలుసా?

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:21 PM

మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసా?

గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి.. కారణమేంటో తెలుసా?
bats hang upside down

ఈ విశాల ప్రపంచంలో ఎన్నో లక్షల జంతు జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణం వెనుక ఓ ఆశ్చర్యపరిచే కారణం ఉంటుంది. మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా? (bats hang upside down).


గబ్బిలాలు పక్షుల్లా నేల నుంచి నేరుగా ఎగరలేవు. ఎందుకంటే వాటి కాళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. అవి చెట్లకు తలకిందులుగా వేలాడితే, ఎగరాలనుకున్నప్పుడు అవి కిందకు జారుతూ వెంటనే పైకి ఎగరగలవు. గబ్బిలాల కాళ్లు బలహీనంగా ఉన్నప్పటికీ వాటిలో లాకింగ్ టెండన్లు ఉంటాయి. వాటి కారణంగా శ్రమ లేకుండా గబ్బిలాల పాదాలు చెట్లను గట్టిగా పట్టుకుని ఉంటాయి. అందువల్ల శక్తి ఖర్చు లేకుండా గబ్బిలాలు గంటల తరబడి వేలాడగలవు. ఇక, గబ్బిలాల రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. తలకిందులుగా వేలాడటం వల్ల అవి మడుచుకుపోయి దెబ్బతినకుండా ఉంటాయి (reason bats sleep upside down).


గబ్బిలాలు రాత్రి జీవులు. పగటిపూట చెట్లు, గుహలు, భవనాల్లో తలకిందులుగా వేలాడుతూ నిశ్శబ్దంగా, సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటాయి (bat survival behavior). తలకిందులుగా ఎత్తులో ఉండటం వల్ల పాములు, భూమిపై ఉండే ఇతర జంతువుల నుంచి రక్షణ లభిస్తుంది. ఒక గబ్బిలం నేలపై పడిపోతే, మళ్లీ ఎగరడం చాలా కష్టం. కాబట్టి తలకిందులుగా వేలాడడం వాటి మనుగడకు చాలా అవసరం. అందుకే గబ్బిలాల శరీర నిర్మాణం తలకిందులుగా వేలాడడానికి అనువుగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

రీల్స్ కోసం ప్రాణాలనైనా లెక్క చేయం.. ఈ యువకుడి బైక్ స్టంట్ చూస్తే..


మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పావురాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 04:29 PM